అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-18T04:26:04+05:30 IST

అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం పలుగుగడ్డలో ఆదివారం చోటు చేసుకున్నది.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జగదేవపూర్‌, అక్టోబరు 17 : అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం పలుగుగడ్డలో ఆదివారం చోటు చేసుకున్నది. పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దేవుని నర్సింహులు (52) అనే రైతు తనకున్న ఎకరం భూమిలో వరి, పత్తి పంటను సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా నర్సింహులు ఇటీవల కుమారుని వివాహంతో పాటు నూతన గృహాన్ని కొనుగోలు చేశాడు. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టం, కుమారుని వివాహానికి అప్పులయ్యాయి. ప్రస్తుతం వేసిన పత్తిపంట వర్షాలకు ఎర్రబడడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన పక్కనున్న రైతులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. వెంటనే వారు సిద్దిపేటలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పరమేశ్వర్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-18T04:26:04+05:30 IST