Abn logo
Sep 26 2021 @ 00:46AM

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

తనకల్లు, సెప్టెంబరు 25: మండల పరిధిలోని చీకటిమానిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై  శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమా దంలో మండలంలోని బుడ్డయ్యకోట కు చెందిన గంగాధర్‌ (35) మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు గ్రామస్థుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. బుడ్డయ్యకోటకు చెం దిన గంగాధర్‌ వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. శని వారం చిత్తూరు జిల్లాలోని పులగంటిపల్లికి వెళ్ళి ద్విచక్ర వాహనంలో తిరిగి స్వగ్రామమైన బుడ్డయ్యకోటకు వస్తుండగా చీకటిమానిపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డున వెళ్తున్న వాహనదారులు గుర్తించి విషయాన్ని రోడ్డు పక్కనే ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ వారికి తెలియజేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.