Abn logo
Sep 24 2021 @ 00:44AM

రైతు ఆత్మహత్యాయత్నం

కొత్తచెరువు, సెప్టెంబరు 23: రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు తన పొలంలో దౌర్జన్యంగా విద్యుత్‌స్తంభాలు ఏర్పాటు చేస్తుండటంతో మానసికంగా కుంగిపోయిన రైతు గురువారం పొలంలో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయ త్నానికి ప్రయత్నించిన సంఘ టన కొత్తచెరువులో చోటుచేసుకుంది. రైతు చంద్రకాం త్‌ తెలిపిన వివరాల మేర కు...తనకున్న పొలంలో సర్వేనెంబర్‌ 216-1,217 లేటర్లలో 5ఎకరాల 30సెంట్లు భూమి ఉందని, అయితే ఇప్పటికే తన అనుభవంలో ఉన్న 3 ఎకరాల భూమిని ఇళ్లప ట్టాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. అయి తే మాకున్న కొద్దిపొలంలో రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు కొద్దిరోజుల క్రితం పక్క పొలంలో నాటిన విద్యుత్‌స్తంభాలను తొలగించి తిరిగి మా పొలంలో నాటుతున్నారన్నారు. పెద్దఎత్తున అధికారులకు ముడుపు లు పుట్టడంతో మాపై కక్షతో అధికారులు పట్టా ఉన్న భూమిలో విద్యుత్‌స్తంభాలు ఏర్పాటుచేసేందుకు సి ద్ధమయ్యారని ఆరోపించారు. కొద్దిరో జుల నుండి తనకు న్యాయం చేయాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా స్పందించలేదని రైతు వాపోయారు. గురువారం రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు తన పొలంలో బలవంతంగా స్తంభాలు నాటేం దుకు సిద్ధమవుతుండటంతో అడ్డుకోబోతే నీపై కేసులు బనాయిస్తామని బెదిరిం చారన్నారు. దీంతో ఉన్న భూమిపోతే తామెలా బతకాలని పొలంలోనే కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పక్కనే ఉన్న కొందరు రైతులు అడ్డుకుని నివారించా రు. ఈ విషయంపై తహసీల్దార్‌ వెంకటరెడ్డిని వివరణ కోరగా ఇరుపక్కగల భూముల రైతులను సంప్రదించే విద్యుత్‌స్తంభాల ఏర్పాటు చేస్తున్నామని ఇందులో ఎవరికి అ న్యాయం చేయమన్నారు.