రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-05-17T10:34:43+05:30 IST

రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వర్షాకా లం పంటసాగు,

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నియంత్రిత పద్ధతి సాగు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి 

నూతన వ్యవసాయ విధానంపై సమీక్షలో మంత్రి కొప్పుల


జ్యోతినగర్‌, మే 16 : రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వర్షాకా లం పంటసాగు, నియంత్రిత పద్ధతిలో వ్యవసా యం సంబంధిత అంశాలపై శనివారం ఎనన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ల మధుతో కలిసి సమీక్ష ని ర్వహించారు.మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా పంట దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. సా గునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడం, 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ సరఫరా, రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం, రైతుబీమా తది తర వినూత్న పథకాలను ప్రభుత్వం త్తశుద్ధితో అ మలు చేస్తున్నదన్నారు.


ప్రభుత్వం తీసుకున్న చర్య ల వల్ల గత సీజన్‌లో 40 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగిందని, కరోనా నేపథ్యంలో దేశంలో ఎ క్కడా లేనివిధంగా 35వేల కోట్ల రూపాయల బ్యాం కు గ్యారెంటీతో రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొన గోలు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. మొక్క జొ న్నలకు 800 రూపాయలకు, ధాన్యానికి 1200 రూ పాయల ధర కూడా వ్యాపారులు ఇవ్వని క్రమంలో ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనగోలు చేస్తు న్నదని తెలిపారు. ప్రతీసారి మొత్తం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు మద్దతు ధర రాకపోవడానికి రైతులందరూ ఒకే రకమైన పంట లను సాగు చేయడమేనన్నారు. క్రాప్‌ కాలనీల దిశ గా, నియంత్రిత పద్ధతిలో వ్యవసాయ విధానం పా టించడం, డిమాండు ఉన్న పంటలను సాగుచేయ డం వల్ల రైతులకు లాభాలు వస్తాయన్నారు.


వర్షా కాలం సాగులో మొక్కజొన్న సాగును నిరుత్సాహ పరిచి, పత్తి, కందులను ప్రోత్సాహించాలని మంత్రి సూచించారు. సన్నరకం వరి పండించే దిశగా రైతు లకు సంపూర్ణమైన అవగాహన కల్పించాలని, మం డలాల వారీగా రైతుబంధు సమితి సభ్యులతో స మావేశాలు నిర్వహించాలన్నారు. రైతుబంధు మి త్రులు గ్రామాల్లో రైతులను సన్న రకం వరిసాగు చేసేందుకు ప్రోత్సహించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 35 శాతం మాత్ర మే సన్నరకం వరిసాగు చేస్తు న్నారని, వానాకాలంలో కనీసం 50 శాతం సన్నరకం వరిసాగు చేసేలా అధికారులు ప్రణాళిక లు సిద్ధంచేయాలన్నారు. జిల్లా కు అవసరమైన పండ్లు, కూర గాయలను సాగు చేసే దిశగా హార్జికల్చర్‌ శాఖ సమర్థవంతం గా పనిచేయాలని ఆదేశించా రు. సన్నరకం సాగు విషయం లో రైతులకు సాంకేతిక అంశా లపై సహకారం, సంపూర్ణమైన మార్గనిర్దేశనం వ్యవసాయ శాఖ నుంచి లభిస్తుంద ని, మంచి మద్దతు ధర లభించేలా చర్యలు తీసు కుంటామన్నారు.


తెలంగాణ సోనా సన్నరకం ధా న్యం మధుమేహ వ్యాధి పీడితులు కూడా తినవ చ్చని, దీనిని సాగుచేస్తే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో రా మగుండం ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, గ్రాంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింఘ్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌, కమిషన ర్‌ ఉదయ్‌కుమార్‌, ఆర్‌డీవో శంకర్‌కుమార్‌, వ్యవ సాయాధికారి తిరుమలప్రసాద్‌, హార్జికల్చర్‌ అధికా రి జ్యోతి, ఇతర శాఖల అధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-17T10:34:43+05:30 IST