వ్యవసాయ పనులకు డ్రోన్‌లు : బేయర్‌

ABN , First Publish Date - 2021-11-24T09:00:42+05:30 IST

వసాయ కార్యకలాపాల్లో డ్రోన్ల వినియోగంపై ప్రయోగాత్మక పరిశీలనలను బేయర్‌ నిర్వహిస్తోంది. ..

వ్యవసాయ పనులకు డ్రోన్‌లు : బేయర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యవసాయ కార్యకలాపాల్లో డ్రోన్ల వినియోగంపై ప్రయోగాత్మక పరిశీలనలను బేయర్‌ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని కంపెనీకి చెందిన మల్టీ బ్రీడింగ్‌ సెంటర్‌లో డ్రోన్లపై ట్రయల్స్‌ నిర్వహిస్తునట్లు బేయర్‌ వెల్లడించింది. వ్యవసాయ పనుల్లో డ్రోన్‌లను వినియోగించడం ద్వారా శ్రామికుల కొరత సమస్యను అధిగమించడం, వాతావరణ మార్పులను ముందుగా అంచనా వేయడం వంటి ప్రయోజనాలను పొందవచ్చనిబేయర్‌ క్రాప్‌సైన్సెస్‌ ఎండీ, సీఈఓ డీ నరేన్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-24T09:00:42+05:30 IST