సన్నరకాల పంటల సాగు రైతులకు లాభదాయకం

ABN , First Publish Date - 2020-05-26T05:38:27+05:30 IST

సన్నరకాల పంటల సాగు రైతులకు ఎంతో లాభదా యకమని జడ్పీ చైర్మన్‌ పుట్టమధు అన్నారు

సన్నరకాల పంటల సాగు రైతులకు లాభదాయకం

కమాన్‌పూర్‌, మే 25: సన్నరకాల పంటల సాగు రైతులకు ఎంతో లాభదా యకమని జడ్పీ చైర్మన్‌ పుట్టమధు అన్నారు. మండలంలోని నాగారం గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యం లో వానాకాలం పంటల సాగు సరళిపై రైతులకు అవగాహన కల్పించారు. జడ్పీచైర్మన్‌ హాజరై మాట్లాడారు. సీఏం కేసీఆర్‌ సూచ నల మేరకు వరిలో సన్నరకాలను సాగుచేయాలని,  మెక్కజొన్న బదులు కంది, పత్తి సాగుచేయాలని సూచించారు. ఎంపీపీ రాచకొండ లక్ష్మి, సర్పంచ్‌ ఇట్టవేన కొమురమ్మ, పీఏసీఎస్‌ చైర్మెన్‌ ఇనగంటి భాస్కర్‌రావు,  ఉన్నారు.


జడ్పీ చైర్మన్‌ను నిలదీసిన రైతులు

రైతులు పలు ప్రభుత్వ పథకాల అమలుతీరుపై జడ్పీచైర్మన్‌ పుట్టమధును రైతులు నిలదీశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం కొంతమంది లబ్ధిదారులకు మెదటి నుంచి అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నరకం పంటలు సాగుచేస్తే గిట్టుబాటు ధర లబిస్తుందని నమ్మకమేమిటని రైతులు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరిట క్వింటాలుకు 4 కిలోల వరకు కోత విదించినా పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలరోజులు గడిచిన కాంటాలు కావడం లేదని, డబ్బులు సకాలంలో ఖాతాలో జమకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Updated Date - 2020-05-26T05:38:27+05:30 IST