రైతులను దెబ్బతీసే చట్టాలు వద్దు

ABN , First Publish Date - 2020-12-04T04:58:48+05:30 IST

రైతులను దెబ్బతీసే వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు.

రైతులను దెబ్బతీసే చట్టాలు వద్దు
రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం నేతలు

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 3: రైతులను దెబ్బతీసే వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. పదిరోజులుగా ఢిల్లీలో చలిని కూడా లెక్కచేయకుండా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లను కేం ద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో  గురువారం కొర్రపాడు రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి సత్యనారాయణ  మాట్లాడుతూ పంజాబ్‌ రైతులు పది రోజులుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేస్తుండగా వారి ఆందోళనకు మద్దతుగా హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీశ్‌గడ్డ రైతులు పాల్గొని నిరసన చేస్తున్నారన్నారు. అకాల వర్షాలతో  రైతుల పంటలన్నీ దెబ్బతిన్నాయని, దీంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన కొందరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలువకుండా కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాలను తెచ్చిందని ఈ చట్టాలను మనరాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయకపోయినా ముఖ్యమంత్రి స్పందించడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే రైతుల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు పక్కీరయ్య, చెన్నారెడ్డి, సుబ్బారావు, కల్యాణ్‌, శ్రీను, సత్యం, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలి

ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబరు 3: దేశ భవిష్యత్‌ను నాశనం చేయబోయే వ్వవసాయ చట్టాలను రద్దుచేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్‌, శివకుమార్‌లు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు గురువారం డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో రైతాంగం చేస్తున్న మహత్తర పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా డీవైఎ్‌ఫఐ ఆందోళన చేస్తుంటే వారందరిని అక్రమంగా అరె్‌స్టలు చేయడం దారుణమన్నారు.  డీవైఎ్‌ఫఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:58:48+05:30 IST