హర్యానా: రైతులను ఢీకొన్ని బీజేపీ నేత కాన్వాయ్

ABN , First Publish Date - 2021-10-08T00:02:04+05:30 IST

అయితే స్థానిక పోలీసులు చెబుతున్న కథనం మరోలా ఉంది. ‘‘స్థానిక సైనీ సమాజిక వర్గానికి చెందిన కొంత మంది కొవిడ్ సమయంలో సహకారం అందించిన వారిని అభినందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సైనీ హాజరయ్యారు..

హర్యానా: రైతులను ఢీకొన్ని బీజేపీ నేత కాన్వాయ్

చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ నయాబ్ సైనికి చెందిన కాన్వాయ్ ఢీకొట్టిందని రైతులు ఆరోపించారు. హర్యానాలోని చండీగఢ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఒక రైతు గాయపడ్డారని ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రైతులు గురువారం తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఎంపీ కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అక్టోబర్ 10న పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన చేస్తామని హెచ్చరించారు.


అయితే స్థానిక పోలీసులు చెబుతున్న కథనం మరోలా ఉంది. ‘‘స్థానిక సైనీ సమాజిక వర్గానికి చెందిన కొంత మంది కొవిడ్ సమయంలో సహకారం అందించిన వారిని అభినందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సైనీ హాజరయ్యారు. అయితే కొంత మంది రైతులు అక్కడికి చేరుకుని కార్యక్రమానికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను లాగేసే ప్రయత్నం చేశారు. ఎంపీ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. ఆ సమయంలో కొంత గందరగోళం జరిగి ఒక రైతు గాయపడ్డారు. అయితే చట్ట వ్యతిరేక పనులకు ఎవరు పాల్పడ్డారనే విషయమై దర్యాప్తు చేస్తున్నాం’’ అని స్థానిక పోలీసులు తెలిపారు.


కాగా, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన కారు ప్రమాదం ఇప్పటికే దేశంలో పెద్ద చర్చకు దారి తీసింది. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయంగా మరింత వేడి రగులుకుంది. ఈ తరుణంలో హర్యానాలో అలాంటి సంఘటన జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2021-10-08T00:02:04+05:30 IST