మత్స్యకారుల సొసైటీని రద్దు చేయాలని రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-04T06:33:12+05:30 IST

మండల పరిధిలోని పట్నం చెరువుకు సంబం ధించిన మత్సకారుల సొసైటీని రద్దు చేయాలని శుక్రవారం పట్నం వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు

మత్స్యకారుల సొసైటీని రద్దు చేయాలని రైతుల ఆందోళన

కదిరిఅర్బన్‌, డిసెంబరు 3: మండల పరిధిలోని పట్నం చెరువుకు సంబం ధించిన మత్సకారుల సొసైటీని రద్దు చేయాలని శుక్రవారం పట్నం వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల సొసైటీ ఏర్పడప్పటి నుంచి పట్నం చెరువు కింద ఆయకట్టు రైతులు పంటలు సాగు చేయడం లేదన్నారు. మత్సకారుల సొ సైటీ సభ్యులు చేపలు పట్టుకోవడానికి చెరువునీరు వదలడంతో పంటలు సాగుచేయడానికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయం ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సమస్య పరి ష్కారం కాలేదన్నారు. చెరువు కింద దాదాపు 500 ఎకరాలు భూమి ఉందని, గత మూడేళ్ళ నుంచి పంటలు సాగు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సొసైటీని రద్దు చేసి గ్రామ పంచాయతీకి అప్పగిస్తే పంచాయతీ వారు టెండర్లు ద్వారా చేపల పెంపకా నికి అవకాశం ఇస్తే పంచాయతీకి కూడా నిధులు సమకూరుతాయన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సాగర్‌ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడా రు. విషయాన్ని మత్స్యశాఖ డీడీ శాంతికి ఎస్‌ఐ తెలియజేశారు. వెంటనే ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు మత్సశాఖ డీడీ చేరుకున్నారు. అదే సమ యంలో నాగారెడ్డిపల్లి వద్ద తాగునీటి పైపులైన్‌ పరిశీలించడానికి వెళ్తున్న ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే మత్సశాఖ డీడీతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. 15 రోజుల్లో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని మత్స్యశాఖ డీడీ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు చలపతినాయక్‌, రైతులు గంగిరెడ్డి, నా గరాజు, సుధాకర్‌, శీనానాయక్‌, తిరుపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T06:33:12+05:30 IST