Advertisement
Advertisement
Abn logo
Advertisement

జాప్యంపై రైతుల కన్నెర్ర

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌

రోడ్లపైకొచ్చి ధాన్యానికి నిప్పంటించి నిరసనలు

30 రోజులుగా ధాన్యం కొనుగోలుకోసం పడిగాపులు

వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఆందోళనయాదాద్రి, నవంబరు16 (ఆంరఽధజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. వానాకాలంలో పండించిన వరిని గింజ సహా కొంటామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రోడ్లపైకివచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం మేఘావృతం అయ్యిందంటే చాలు... ఆరుగాలం శ్రమిం చి పండించిన పంట నీటి పాలవుతోందని ఆందోళన చెందుతున్నారు. రెండురోజులుగా జిల్లాలో పలు ప్రాం తాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. చౌటుప్పల్‌, భువనగిరి, తదితర మండలాల్లోని పలు కల్లాల్లో కి నీరు చేరి, ధాన్యం తడిసింది. భారీ వర్షాలు కురిసినట్లయితే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లాలో రెండు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని నిరసన గళం వినిపిస్తున్నారు. మంగళవారం బీబీనగర్‌ మండల కేంద్రంలో జాతీయరహదారిపై బైఠాయించి, వరి కుప్పలను రోడ్లపై పోసి రాస్తారోకో చేపట్టారు. ధాన్యానికి నిప్పు అంటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లాలో వరికోతలు ప్రారంభమై 40 రోజులు కావస్తోంది. రైతులు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర కు ధాన్యాన్ని విక్రయించేందుకు రైతుల కల్లాల్లో సిద్ధం గా ఉంచారు. పలు ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రా ల వద్దే రాశులను ఏర్పాటు చేసుకున్నారు. ధాన్యం ఎప్పుడెప్పుడు కొనుగోలు చేస్తారని నెలరోజులగా రైతు లు పడిగాపులు కాస్తున్నారు. వానాకాలంలో పండించి న ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం అక్టోబరు చివరివారంలో కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. జిల్లాలో మొత్తం 261 కేంద్రాలను ఏర్పాటుచేసి, ఇప్పటివరకు 256 ప్రారంభించారు. నేటివరకు కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారే తప్ప, ధాన్యం సేకరించడంలేదు. 


పేరుకే కొనుగోలు కేంద్రాలు

కొనుగోలు కేంద్రాలు చూసుకుని మురువ... చెప్పుకుని ఏడ్వటానికే అన్న చందంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2.60లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దాదాపు 2లక్షల మెటిక్ర్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అక్టోబరు చివరివారంలో ప్రభుత్వం నిర్దేశించిన కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభిస్తే ఇప్పటివరకు దాదాపు 70వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉండేది. జిల్లాలో పలుచోట్ల ఆలస్యంగా కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 5వేల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేసిం ది. ఆలస్యమైనప్పటికీ కేంద్రాల్లో కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పలు పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.  


ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తాం : డి.శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ 

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వానాకాలంలో పండించిన ధాన్యాన్ని రైతుల వద్ద సేకరిస్తాం. మొత్తం జిల్లాల్లో 261 కేంద్రాల్లోనూ వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి, వేగిరంచేస్తాం. ధాన్యం కొనుగోలుపై రైతులు ఆందోళన చెందవద్దు, తేమ లేకుండా ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలి. రైస్‌ మిల్లర్లతో చర్చించి దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. 


Advertisement
Advertisement