వైసీపీ జరపాల్సింది 'రైతు దినోత్సవం' కాదు.. రైతు దగా దినోత్సవం: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-07-08T21:43:08+05:30 IST

వైసీపీ జరపాల్సింది 'రైతు దినోత్సవం' కాదు.. రైతు దగా దినోత్సవం: చంద్రబాబు

వైసీపీ జరపాల్సింది 'రైతు దినోత్సవం' కాదు.. రైతు దగా దినోత్సవం: చంద్రబాబు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ జరపాల్సింది ‘‘రైతు దినోత్సవం’’ కాదు..‘‘ రైతు దగా దినోత్సవం అని చంద్రబాబు విమర్శించారు. ఏడాది పాలనలోనే చేసిన మోసాలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వ్యవసాయ బడ్జెట్ లో 35 శాతం మాత్రమే ఖర్చు పెట్టిన మీకు రైతు దినోత్సవం జరిపే హక్కెక్కడిది..? అని, 65 శాతం బడ్జెట్ రైతులకు ఖర్చు చేయలేక పోవడం మీ చేతగానితనం కాదా.. ? అని చంద్రబాబు ప్రశ్నించారు.


టీడీపీ 5 ఏళ్లలో వ్యవసాయానికి రూ. 90 వేల కోట్ల నిధులతో రైతులను ఆదుకున్నామని చంద్రబాబు చెప్పారు. ‘‘రైతు భరోసా’’ కొత్త పథకం ఏమీ కాదని, టీడీపీ పథకం ‘‘అన్నదాత సుఖీభవ’’ రద్దుచేసి దీనిని తెచ్చి, ఒక్కో రైతుకు 5 ఏళ్లలో రూ. 80 వేలు నష్టం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘రైతు భరోసా’’ పేరుతో 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది రూ37,500 మాత్రమే అని, అదే టీడీపీ ప్రభుత్వం వచ్చివుంటే ఒక్కో రైతుకు రూ లక్షా 20 వేలు వచ్చేదని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చేది కాకుండా.. బడ్జెట్ లో చెప్పిన సంఖ్యలోనే 10 లక్షల మంది రైతులకు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు. సున్నావడ్డీ పథకానికి రూ 1,100కోట్ల బడ్జెట్ పెట్టి, రూ. 100కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడమే వైసీపీ రైతు దినోత్సవమా..?  అని చంద్రబాబు ప్రశ్నించారు.


Updated Date - 2020-07-08T21:43:08+05:30 IST