ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల మృతి

ABN , First Publish Date - 2021-11-27T04:43:17+05:30 IST

వరి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో రైతులు గుండె ఆగి కల్లాలపైనే మృతి చెందుతున్నారని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల మృతి
కామారెడ్డిలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

అన్నదాతల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తోంది

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

కామారెడ్డి/ఎల్లారెడ్డి/లింగంపేట/నాగిరెడ్డిపేట/సదాశివ నగర్‌, నవంబరు 26: వరి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో రైతులు గుండె ఆగి కల్లాలపైనే మృతి చెందుతున్నారని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు. కామారెడ్డి జిల్లాలోని ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై పలు కొనుగోలు కేంద్రాలను ప్రొఫెసర్‌ శుక్రవారం పరిశీలించారు. అదేవిధంగా కొనుగోళ్లు జరుగక మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించా రు. నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, సదాశివనగర్‌, కామారెడ్డిలోని గాంధీగంజ్‌, జిల్లాలోని పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కోదాండరాం మాట్లాడా రు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో కామారెడ్డి జిల్లాలోని ఇప్పటి వరకు ముగ్గురు రైతులు కొనుగోలు కేంద్రాల్లోని కుప్పల వద్దే మృతి చెందడం బాధాకరమని అన్నారు. ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకువచ్చి రోజుల తరబడి కుప్పల వద్దే రైతులు నిరీక్షించాల్సి వస్తుందన్నారు. గత 20 రోజుల కిందట లింగంపేట మండలంలో కొనుగోలు కేంద్రంపైనే ఓ రైతు మృతి చెందాడని ఆ సంఘటన జరిగిన వారం రోజులకే బాన్సువాడలో మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, రెండు రోజుల కిందట సదాశివనగర్‌ మండలం అడ్లూ ర్‌ ఎల్లారెడ్డిలో మరో రైతు వడ్ల కుప్పపైనే గుండె ఆగి మృతి చెందాడని అన్నారు. ఇలా కామారెడ్డి జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ కుప్పల వద్దే రైతులు కాపలాకాయలేక ప్రాణం వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్నదాతల మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని మండి పడ్డారు. ధాన్యం కొనుగోళ్లు చేసేది కేంద్రప్రభుత్వమేనని సీఎం కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ గత 7 సంవత్సరాలుగా ఇక్కడి ప్రభుత్వమే కొనుగోలు చేసింది కదా ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్లలో రాజకీయం చేస్తూ ధాన్యం చేయకుండా రైతులను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. యాసంగి పంటల సాగుపై కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వ డం లేదన్నారు. దీంతో వరి వేయాలా వద్దా అనే దానిపై రాష్ట్ర రైతుల్లో ఆయోమయ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీ వల సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. కానీ వరి సాగుపై కేసీఆర్‌ ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి ఏమి చేశారు, ప్రధాని మోదీతో పంటల సాగుపై, ధాన్యం కొనుగోళ్లపై ఏమి చర్చించారు. అనేదానిపై రైతులకు కేసీఆర్‌ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ జనసమితి పార్టీ పోరుబాట పట్టిందన్నారు. ఇందులో భాగంగానే రైతు ప్రయోజనాల పరిరక్షణ యాత్ర చేపట్టామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు, కుప్పలుగా ఉన్నాయని కొనుగోలు జరుగకపోవడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ధాన్యం కొనుగోలు జరిగే వరకు టీజేఎస్‌ రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం రాజకీయాలు పక్కన బెట్టి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నిజ్జ రమే ష్‌, లక్ష్మణ్‌, వినోద్‌కుమార్‌, తుల్జారెడ్డి, కొండల్‌రెడ్డి, భుజంగరెడ్డి, అనిల్‌, మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T04:43:17+05:30 IST