Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

- ఎస్‌ఐ హామీతో విరమణ

రాయికల్‌, నవంబరు 30: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపో యాయని తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు మంగళ వారం ధర్నా నిర్వహించారు. మండలంలోని రాయికల్‌ రామాజీపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొలకలు వచ్చిందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు. గంట సేపు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు, రైతు ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement