ధాన్యం కొనుగోళ్లు చేయాలని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2021-12-04T06:32:57+05:30 IST

వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ శుక్రవారం బీర్‌పూర్‌ మం డలంలోని తుంగూర్‌ గ్రామంలో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

ధాన్యం కొనుగోళ్లు చేయాలని రైతుల ధర్నా
తుంగూర్‌ గ్రామంలో ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు

బీర్‌పూర్‌, డిసెంబరు 3: వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ శుక్రవారం బీర్‌పూర్‌ మం డలంలోని తుంగూర్‌ గ్రామంలో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మి ల్లర్ల దోపిడీ అరికట్టాలి, అధికారులు నిర్లక్ష్యం వీడాలి అంటూ రెండు గంటల పాలు నినాదాలు చేశా రు. తప్పా తాలును ప్రధాన రహదారిపై పోసి నిప్పంటించి ధర్నా నిర్వహించారు. దీంతో రెండు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ ఆరీఫొద్దిన్‌, ఎస్సై నినిషారెడ్డి, ఏవో అనూష సంఘటన స్థలానికి చేరుకొని ధాన్యాన్ని వెంటనే కొను గోళ్లు జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు జి తేంధర్‌ యాదవ్‌, తిరుపతి, జనార్దన్‌, మల్లేశం, నాగేష్‌, శంకర్‌, మల్లేష్‌, రవి, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

గొల్లపల్లిలో రాస్తారోకో

గొల్లపల్లి, డిసెంబరు 3 : గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ మార్కెట్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయ కులు రైతులతో కలిసి శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల-ధర్మారం ప్రధాన రహదా రిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తేమ, తప్పతాళు పేరిట బస్తాకు రెండు మూడు కిలోలు కోతలు పెడుతూ రైతుల ను నిలు వుదోపిడీ చేస్తున్నారని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కట్ట మహేష్‌ ఆరోపించారు. తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌, ఎస్సై శ్రీధర్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ లింగారెడ్డి సంఘటనాస్థలికి తరలివచ్చి రైతులతో మాట్లాడినప్పటికి  స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని భీష్మించుకూర్చున్నారు. కొనుగోళ్లను వేగవం తం చేయిస్తామని, ఏలాంటి కటింగ్‌లు లేకుండా తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లుకు తరలి స్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కట్ట మహేష్‌ నాయకులు కస్తూరి సత్యం, మరిపెల్లి సత్యం, సింహాచలం సత్యానారాయణ; బీజేవైఎం మండల శాఖ అధ్యక్షుడు లక్కాకుల వెంకటేష్‌, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-04T06:32:57+05:30 IST