ధాన్యం తరలించాలని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2021-12-03T04:41:16+05:30 IST

కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రైతులతో కలిసి అఖిల పక్షం నాయకులు ఎల్లారెడ్డిలో ధర్నా నిర్వహించారు.

ధాన్యం తరలించాలని రైతుల ధర్నా
ఎల్లారెడ్డిలో ధర్నా చేస్తున్న అఖిల పక్షం నాయకులు, రైతులు

ఎల్లారెడ్డి, డిసెంబరు 2: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రైతులతో కలిసి అఖిల పక్షం నాయకులు  ఎల్లారెడ్డిలో ధర్నా నిర్వహించారు. రైస్‌మిల్లర్లు ధాన్యం లారీలను అన్‌లోడ్‌ చేయకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అఖిలపక్షం నాయకులు రైతులతో కలిసి గురువారం ఎల్లారెడ్డిలో ఽభారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైస్‌ మిల్లర్లు తరుగు, నూకలు, తేమ శాతం పేరుతో ఒక్కో ధాన్యం బస్తాకు 2 కిలోల తరుగు తీసే వరకు లారీలను అన్‌లోడ్‌ చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పెరిగిపోతున్నాయని అ న్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చి 45 రోజు లు గడుస్తున్నా కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టకపోవడంపై మండిపడ్డారు. ఆర్‌డీవో వచ్చేంత వరకు తాము కదిలేది లేదని దాదాపు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించా రు. దీంతో కామారెడ్డిలో ఉన్న ఆర్డీవో శ్రీనునాయక్‌తో రెవెన్యూ అఽధికారులు ఫోన్‌లో మాట్లాడించి తరుగు, నూకల పేరిట తరుగు చేసిన ధాన్యాన్ని రికవరి చేయించి రైతులకు న్యాయం జరిగేలా చేయిస్తామ ని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకురాలు జమునారాథోడ్‌, బీజేపీ నాయకుడు విద్యాసాగర్‌, రైతుకిసాన్‌ మండల అధ్యక్షుడు కాశీ, బీఎస్పీ నాయకులు సాయిబాబా, ఎంఆర్‌పీ ఎస్‌ నాయకుడు పద్మారావు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T04:41:16+05:30 IST