రైతుల పండుగ సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-16T06:29:59+05:30 IST

రైతుల పండుగ సంక్రాంతి అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మండలంలోని ఏ. నారాయణపురం పంచాయతీలో దక్ష కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాం తి సందర్భంగా రాతిదూలం పోటీలు జరిగాయి.

రైతుల పండుగ సంక్రాంతి
పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి

-  ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి


అనంతపురంరూరల్‌, జనవరి 15 : రైతుల పండుగ సంక్రాంతి అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మండలంలోని ఏ. నారాయణపురం పంచాయతీలో దక్ష కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాం తి సందర్భంగా రాతిదూలం పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై పోటీలను ప్రారంభించారు. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారని అందుకే సంక్రాంతి రైతుల పండుగ అని అ న్నారు. తెలుగు ప్రాంతాల్లో సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. సంక్రాంతి అంటే రంగవల్లులు, గంగిరెద్దుల కోలాహలం, గ్రామీణ క్రీడలు గుర్తుకు వస్తాయన్నారు. అంతరించి పోతున్న గ్రామీణ క్రీడలు రాతిదూలం, కబడ్డీ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు.  ఐదురోజుల పాటు పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కబడ్డీ, రాతిదూలం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతచంద్రారెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 


గార్లదిన్నె: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం కల్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్‌ నా యకులు ముంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో రాతిదూలం లాగుడు పోటీలు జరిగాయి. పోటీల్లో గెలుపొందిన వృషభాలకు మొదటి బహుమతి రూ. 8వే లు, రెండవ బహుమతి రూ. 4వేలు, మూడవ బహుమతి రూ. 2వేలను కేశవరెడ్డి అందచేశారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, రైస్‌మిల్‌ వెంకట్రాముడు, గంగాధర్‌, శేఖర్‌, తిరుపాల్‌, రుద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T06:29:59+05:30 IST