Advertisement
Advertisement
Abn logo
Advertisement

కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం

వీడని తుపాన్లు..

ఆందోళనలో అన్నదాత

పెంటపాడు, నవంబరు 28: అన్నదాతను వర్షం భయం వెంటాడుతూనే ఉంది.  సార్వా  చేతికందే సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు అన్నదాత ఆశలపై నీళ్ళు చల్లాయి. మండలంలో వేల ఎకరాలు వర్షాల ధాటికి పడిపోవడతో  మిగిలిన కాస్త ధాన్యాన్నయినా  ఒబ్బిడి చేసుకుందామనే ఆశతో రెండు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా అన్నదాతలు కోతలను ఆరంభించారు.  ఆదివారం  మళ్ళీ ఆకాశంలో కారు మబ్బులు అలుముకోవడంతో  కోసిన ధాన్యంపై బరకాలు కప్పుకుని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరలా ఇంకో తుపాను వస్తోందన్న వార్తలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలో కోసిన ధాన్యం చాలా మటుకు ఇంకా కల్లాలపైనే ఉండి పోవడంతో  రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
Advertisement