రైతుల ఆశలు అడియాసలు

ABN , First Publish Date - 2021-03-08T06:52:32+05:30 IST

ఎల్లంపల్లి కాలువ ద్వారా తమ పంట పొలాలకు నీరు అందుతుందనుకున్న రైతుల ఆశలు అడియాసలు అయ్యాయని కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రైతుల ఆశలు అడియాసలు
పొలాలను పరిశీలిస్తున్న ఆది శ్రీనివాస్‌

వేములవాడ రూరల్‌ మార్చి 7 ఎల్లంపల్లి కాలువ ద్వారా తమ పంట పొలాలకు నీరు అందుతుందనుకున్న రైతుల ఆశలు అడియాసలు అయ్యాయని కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండల పరిధిలోని నూకలమర్రి గ్రామంలో ఎండి పోయిన పంట పోలాలను ఆదివారం ఆయన పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ పంట పొలాలు ఏండుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదన్నారు. చివరకు పొలాలు పశవులకు మేతగా వేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. కౌలు రైతుల పరిస్థితి మరి అధ్వానంగా మారిందన్నారు. నీటి విడుదల ఇంకా ఆలస్యమైతే వేల ఏకరాల పంట ఎండిపోయి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 2 వేల చొప్పున నష్ట పరిహరం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి సంగె స్వామి, ఎదురుగట్ల సర్పంచ్‌ కరుణకార్‌, రైతులు అంజయ్య, మదు, దెవయ్య, ప్రశాంత్‌, భరత్‌, నరేష్‌, శంకరయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T06:52:32+05:30 IST