రైతులకు సంఘీభావంగా కవుల సభ రేపు

ABN , First Publish Date - 2020-12-19T06:01:47+05:30 IST

కేంద్రప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల పట్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సుమారు 20రోజులకు పైగా ఇంటిని, పొలాన్ని వదిలి ఢిల్లీ నగర కూడళ్ళలో నిరసన జెండాలై నినదిస్తున్నారు. తమ బతుకే కాదు....

రైతులకు సంఘీభావంగా కవుల సభ రేపు

కేంద్రప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల పట్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సుమారు 20రోజులకు పైగా ఇంటిని, పొలాన్ని వదిలి ఢిల్లీ నగర కూడళ్ళలో నిరసన జెండాలై నినదిస్తున్నారు. తమ బతుకే కాదు, మనందరి బతుకులు పచ్చగా ఉండాలని, గడ్డ కట్టే చలిలో గళం విప్పుతున్నారు. అందరి ఆకలి తీర్చే అన్నదాతకు అండగా మన కలాలు తోడుండలేవా?


రండి! తినే అన్నం మెతుకు రుణం తీర్చుకునేందుకు భరోసా కవిత్వ గీతాలాలపిద్దాం. ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో కవితలై, మాటలై, పాటలై పల్లవిద్దాం.


– -తెలంగాణ రచయితల వేదిక; సింగిడి తెలంగాణ రచయితల సంఘం; తెలంగాణ రచయితల సంఘం; తెలంగాణ సాహితి; కవిసంగమం; హర్యాలి ముస్లిం రచయితల వేదిక; అభ్యుదయ రచయితల సంఘం; ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక; బహుజన రచయితల సంఘం; ఎరుక సాహితీ సంస్థ; బహుజనం సాంస్కృతిక వేదిక; ఫూలే అంబేద్కర్ అధ్యయన వేదిక; ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక; తెలంగాణ చైతన్య సాహితి; బహుజన సాహిత్య కచ్చీరు; బహుజన రచయితల వేదిక; జంబూ సాహితి; బహుజని; తెలంగాణ సామాజిక రచయితల సంఘం; నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక.

Updated Date - 2020-12-19T06:01:47+05:30 IST