రైతులకు తక్షణమే రుణాలివ్వాలి

ABN , First Publish Date - 2020-05-21T10:07:17+05:30 IST

రైతులకు తక్షణమే రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి బ్యాంక్‌ అధికారులకు సూచించారు. బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో డీ

రైతులకు తక్షణమే రుణాలివ్వాలి

భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం


ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం :  రైతులకు తక్షణమే రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి బ్యాంక్‌ అధికారులకు సూచించారు. బుధవారం కొత్తగూడెం క్లబ్‌లో డీ ఆర్‌డీఏ, వ్యవసాయ, బ్యాంక్‌ అధికారులతో రైతుకు రుణాలు మంజూరు, స్ర్తీ నిధి, బ్యాంక్‌ లింకేజీ తదితర అంశాలపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ పంట రుణాలను స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం మంజూరు చేయాలని చెప్పారు. రైతు బాగుంటేనే మనందరం బాగుంటామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ పథకం  01-04-2014 నుంచి 11-12-2018 వరకు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులకు వర్తిస్తుంద న్నారు. మొదటి విడతగా 25వేలు రుణాలను మాఫీ చేస్తామన్నారు. తదుపరి లక్ష వరకుగల పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. బ్యా ంకుల వారీగా పంటల రుణాలు పొందిన లబ్ధిదారుల జాబితాను ఆయా మండల వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలని ఆయన సూచిం చారు.


మండల సమాఖ్యలు స్ర్తీ నిధి, బ్యాంక్‌ లింకేజీ, రుణాలు మం జూరులో గ్రామ స్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పంట నిల్వలు కొరకు ప్రభుత్వం గోదాములు, అగ్రి ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.  వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందాలన్నారు. ఈ నెల 28వ తేదీన ఇదే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక చక్రవర్తి, డీఆర్‌డీఏ మధుసూధన్‌రాజు, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి టెక్నికల్‌ రవి కుమార్‌, అన్ని బ్రాంచీల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-21T10:07:17+05:30 IST