రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

ABN , First Publish Date - 2020-06-05T10:20:20+05:30 IST

రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు ..

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 4 : రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి  వెంకటరావు డిమాండ్‌ చేశారు. గురువారం ఒంగోలులోని సంఘ కార్యాలయంలో పెంట్యాల హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ పొగాకు, సుబాబుల్‌, శనగలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.


పొగాకు ఉత్పత్తులు అమ్ముడు పోక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్యకు రూ.100 కోట్లు కేటాయించి కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కృష్ణిపాటి కోటిరెడడ్డి, గోగినేని బసవ పున్నయ్య, బెజవాడ శ్రీనివాసరావు, పల్లకి కోటిరెడ్డి, టి.రామారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:20:20+05:30 IST