Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 6: జిల్లాలోని రైతులు వరిసాగుకు ప్రత్యామ్నయంగా అరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతువేదికలో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో సాగుచేసే వరిధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయదన్నారు. వరికి బదులుగా పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు తదితర పంటలను సాగు చేయాలన్నారు. సమావేశంలో ఏడీ ఏలు వెంకటి, మనోహర్‌, మిలింద్‌కుమార్‌, ఏవో, ఏఈవోలు పాల్గొన్నారు.

ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి..

పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ లలితపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నాయకులు శంకర్‌, షేకు, రాజేష్‌, జగ్గరావు సోమవారం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రిన్సిపాల్‌ విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని, విద్యార్థులను పట్టించుకోవడం లేదని విచారణ జరిపి చర్యలు తీసుకో వాలని కోరారు.

వట్టివాగు కాలువ గండి పూడ్చండి..

ఆసిఫాబాద్‌ రూరల్‌: వట్టివాగు కుడి కాలువకు పడిన గండిని పూడ్చాలని సోమ వారం మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్‌ ఆధ్వ ర్యంలో ఈదులవాడ,కొమ్ముగూడ, బూర్గుడ, అప్పపల్లి రైతులు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు విన తిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్పం దించి ఇరిగేషన్‌ అధికారులను పిలిపించి వారం రోజు లలోపు పనులుపూర్తి చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీఎంపీపీ బాలేష్‌గౌడ్‌ మాట్లాడుతూ గండివిషయమై ఎన్నిసార్లు ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సర్పంచ్‌ భీమేష్‌, బాపురావు, రైతులు మధుకర్‌, శంకర్‌, వినోద్‌, మల్లేష్‌, ప్రభాకర్‌, సుబ్బారావు, వెంకటేష్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement