ఆయిల్‌పాం తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-10-28T04:39:22+05:30 IST

ఆయిల్‌ పాం తో టల పెంపకంపై రైతులు దృష్టి సారించే విధంగా అ న్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆయిల్‌పాం తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలి
జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాష 

- సాగు ప్రదర్శనపై రైతులకు విజ్ఞానయాత్ర 


వనపర్తి అర్బన్‌, అక్టోబరు 27: ఆయిల్‌ పాం తో టల పెంపకంపై రైతులు దృష్టి సారించే విధంగా అ న్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధ వారం వనపర్తిలోని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్‌ పాం తోటల సాగు ప్రదర్శనపై విజ్ఞాన యాత్ర ఆర్‌టీసీ బస్సు లను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్‌ పాం సాగు రైతులు తోటలపై చిత్ర ప్రదర్శన ద్వారా అవ గాహన చేసుకోవాలని సూచించారు. రేపు సంబం ధిత రైతులందరు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని ఆశ్వరావుపేటలోని ఆయిల్‌ పాం రైతులతో ముఖా ముఖి చర్చించి, ఆ జిల్లాలో ఆయిల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించి సాగు విధానాలను తెలుసు కుంటారని కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖాధికారి సురేష్‌కుమార్‌, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


 ఎస్‌ఎస్‌ఆర్‌-2022పై వీడియో కాన్ఫరెన్స్‌ 


అంతకుముందు కలెక్టర్‌ స్పెషల్‌ సమ్మరి రివిజన్‌-2022 ముసాయిదా ఓటరు జాబితాపై హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్ని కల కమిషన్‌ ద్వారా ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు పేర్లు, మార్పునకు వచ్చిన దరఖాస్తులు అన్ని పరిష్కరించి నవంబరు 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచు రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. నవంబరు 6, 7, 27, 28వ తేదీల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 

Updated Date - 2021-10-28T04:39:22+05:30 IST