Abn logo
Sep 26 2021 @ 22:09PM

రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు

రాజేష్‌ కుటుంబీకులతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, సెప్టెంబరు 26: కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తోనే పంటలు ముంపునకు గురై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. చెన్నూరు పట్టణానికి చెందిన కౌలు రైతు కమ్మల రాజేష్‌ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా అతని కుటుం బాన్ని ఆదివారం వివేక్‌వెంకటస్వామి పరామర్శిం చారు. కుటుంబీకులకు రూ.50 వేల నగదును అం దజేశారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఆత్మహ త్యలు చేసుకుంటే సమస్య పరిష్కారం కాదన్నారు. రైతులందరు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, రైతులకు మద్దతుగా నేను ఉంటానని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు, ముంపునకు గురైన భూముల వివరాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్తానని, అవసరం అయితే కేంద్ర మంత్రి దగ్గరకు కూడా రైతులను తీసుకువెళ్తామని పేర్కొ న్నారు. వెంకటేశ్వర్‌గౌడ్‌, వెంకటేశ్వర్‌, సుశీల్‌కుమా ర్‌, శ్రీనివాస్‌, బానేష్‌, మహేష్‌,  పాల్గొన్నారు.