Abn logo
Apr 7 2020 @ 12:11PM

సీఆర్డీఏ అధికారులను అడ్డుకున్న రైతులు

గుంటూరు: మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఆర్5 జోన్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణకు సీఆర్డీఏ అధికారులు వెళ్లారు. వారిని రైతులు, జేఏసీ నేతలు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజాభిప్రాయం ఎలా చేపడతారని రైతులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో సీఆర్డీఏ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Advertisement
Advertisement
Advertisement