వర్షాలతో రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-24T04:56:34+05:30 IST

వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలతో రైతుల ఆందోళన
మేఘావృతమైన ఆకాశం

నేలకొరిగిన వరి చేలు

తణుకు, అక్టోబరు 23: వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి పూర్తిగా పెట్టిన రైతులకు అకాల వర్షాలతో వాపోతున్నారు. శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో పాటు బలమైన గాలులు వీయడంతో అక్కడక్కడ వరిచేలు నేలవాలాయి. వరిచేలు ప్రస్తుతం గింజలు పాలుపోసుకునే స్థితిలో ఉన్నాయి. ఈ క్రమంలో చేలు కాస్త బరువుగా ఉంటాయి. దీనికి తోడు వర్షం కురవడం వల్ల నీరు వల్ల చేలు బరువు అయ్యి నేలకొరిగాయి. నేల మట్టం అయిన చేలు దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి. నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. ఒకవేళ చేలు పైకి లేపి కట్టినా కూడా అదనపు భారం తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ప్రతి ఏటా ప్రకృతి సహకరించకపోవడం వల్ల నష్టం జరుగుతునే ఉందని పలువురు రైతులు తెలిపారు.


Updated Date - 2021-10-24T04:56:34+05:30 IST