ఇసుక టిప్పర్లను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2020-06-06T08:35:24+05:30 IST

మండలంలోని బుడిమేపల్లి, అజ్జయ్యదొడ్డి ప్రాంతంలో ఇసుక టిప్పర్ల రాకపోకలు పెచ్చుమీరిపోయాయి

ఇసుక టిప్పర్లను అడ్డుకున్న రైతులు

అతివేగంతో వెళుతూ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన టిప్పర్‌ 

షార్ట్‌ సర్క్యూట్‌తో పాడైపోయిన టీవీలు, ఫ్రిజ్‌లు  


 బ్రహ్మసముద్రం, జూన్‌ 5 : మండలంలోని బుడిమేపల్లి, అజ్జయ్యదొడ్డి ప్రాంతంలో ఇసుక టిప్పర్ల రాకపోకలు పెచ్చుమీరిపోయాయి. శుక్రవారం ఉదయం అతివేగంతో వెళుతున్న ఓ ఇసుక టిప్పర్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడం తో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి టీవీలు, ఫ్రిజ్‌లు పాడైపోయా యి. దీన్ని నిరసిస్తూ ఆయా గ్రామాల రైతులు టిప్పర్లను అడ్డుకు న్నారు. రహదారిపై బైఠాయించి టిప్పర్ల రాకపోకలను నిలిపివేశారు. రాత్రింబవళ్లు వందలాది ఇసుక టిప్ప ర్లు అధిక లోడ్‌తో వెళుతుండటంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశా రు.


ప్రతిరోజు టిప్పర్లు అతివేగంగా రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నట్టు  గ్రామస్థులు పాండు, మహేష్‌, సతీష్‌, కిష్ట తదితరులు తెలిపారు.  టిప్పర్లు తమ గ్రామంలో వెళ్లకూడదంటూ గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో పదుల సంఖ్యలో టిప్పర్లు ఆగిపోయాయి.  వాహన డ్రైవర్లు గ్రామంలో కూడా అతివేగంతో వెళ్లడంతో ఇళ్లలోకి దుమ్ము, ధూళి చేరుతోందని వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నుంచి కాకుండా వేరే చోటు నుంచి టిప్పర్లు వెళ్లేలా చూడాలని గ్రామస్థులు కోరారు. 

Updated Date - 2020-06-06T08:35:24+05:30 IST