నా భార్యకు ముద్దు పెట్టలేకపోతున్నా

ABN , First Publish Date - 2021-01-18T07:29:13+05:30 IST

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా తన హాస్య చతురతతో పలువురిని నవ్వించారు. కరోనా మహమ్మారి

నా భార్యకు ముద్దు పెట్టలేకపోతున్నా

ఫరూఖ్‌ అబ్దుల్లా


జమ్ము, జనవరి 17: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా తన హాస్య చతురతతో పలువురిని నవ్వించారు. కరోనా మహమ్మారి కారణంగా తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోతున్నానని చమత్కరించారు. ఆదివారం జమ్మూలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కనీసం కరచాలనం చేయడానికీ జనం భయపడే పరిస్థితి నెలకొంది. కౌగిలించుకోవాలని హృదయం కోరుతున్నా అలా చేయలేకపోతున్నాం. ఇతరులతో కరచాలనం చేస్తే, కౌగిలించుకుంటే ఏం జరుగుతుందోనని అందరూ భయపడుతున్నారు. నేను నా భార్యకు కనీసం ముద్దు కూడా పెట్టలేకపోతున్నా. అలాగే నేను మాస్కు ధరించకుండా ఉన్న ఫొటో నా కూతురి కంటపడితే ఇంటికెళ్లాక ఇక నా పని అయిపోయినట్లే’’ అని ఫరూఖ్‌ అన్నారు. దీంతో ఆయన ప్రసంగాన్ని విన్న వారంతా పగలబడి నవ్వారు. ప్రస్తుతం టీకాలు వచ్చినా వాటి సామర్థ్యాన్ని కాలమే చెబుతుందని ఆయన అన్నారు.  

Updated Date - 2021-01-18T07:29:13+05:30 IST