తాలిబన్లపై ఫారూఖ్ అబ్దుల్లా పొగడ్తలు

ABN , First Publish Date - 2021-09-09T03:09:28+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు మంగళవారం ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుండ్ ఈ తాత్కాలిక ప్రభుత్వానికి బాధ్యత వహించనున్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ స్పందిస్తూ

తాలిబన్లపై ఫారూఖ్ అబ్దుల్లా పొగడ్తలు

శ్రీనగర్: ప్రపంచమంతా తాలిబన్లపై భయాందోళన వ్యక్తం చేస్తుంటే వారిని పొగుడుతూ షాకిచ్చారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా. అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు అనేక అరాచకాలు సృష్టిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాలిబన్ల దాష్టికానికి భయపడి వేల మంది అఫ్ఘాన్లు దేశం వదిలి పారిపోతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులను పక్కన పెట్టి ప్రజలకు మంచి పాలన అందిస్తారని తాలిబన్లపై ఫారూఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అది కూడా ఇస్లామిక్ నియమాల ఆధారంగా పాలన సాగిస్తారని ఫారూఖ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.


అఫ్ఘానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు మంగళవారం ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుండ్ ఈ తాత్కాలిక ప్రభుత్వానికి బాధ్యత వహించనున్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ స్పందిస్తూ ‘‘ఇస్లాం నియమాలను ఆధారం చేసుకుని తాలిబన్లు ఉత్తమ పాలన అందిస్తారని ఆశిస్తున్నాను. నూతనంగా ఎన్నికైన నాయకత్వం మానవ విలువలను కాపాడాలని నేను కోరుతున్నాను’’ అని అన్నారు.

Updated Date - 2021-09-09T03:09:28+05:30 IST