ఫ్యాషన్‌ షో అదరహో

ABN , First Publish Date - 2021-10-18T06:04:05+05:30 IST

వయ్యారి భామల హొయలు...మేమేం తీసిపోలేదన్నట్లు అందాల యువకుల సోయగం...వెరసి ఫ్యాషన్‌ షో అదరహో అనిపించింది.

ఫ్యాషన్‌ షో అదరహో
షోలో పాల్గొన్న యువతీ యువకులు

తీరంలో మిస్టర్‌ అండ్‌ మిస్‌ల హొయలు

ఆకట్టుకున్న ర్యాంప్‌ వాక్‌, క్యాట్‌ వాక్‌

విశాఖపట్నం, అక్టోబరు 17: వయ్యారి భామల హొయలు...మేమేం తీసిపోలేదన్నట్లు అందాల యువకుల సోయగం...వెరసి ఫ్యాషన్‌ షో అదరహో అనిపించింది. బీచ్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో ఆదివారం ‘సో స్టార్‌’ సంస్థ నిర్వహించి మిస్టర్‌ అండ్‌ మిస్‌ స్టార్‌ ఫ్యాషన్‌ షోలో యువతీయువకులు తమ అందచందాల ప్రదర్శనతో అదరగొట్టారు.


ర్యాంప్‌ వాక్‌, క్యాట్‌ వాక్‌ లతో ఆహూతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈవో బెన్నీయాదవ్‌  మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోని ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఇప్పటికే హైదరా బాద్‌, విజయవాడ నగరాల్లో ఆడిషన్స్‌ నిర్వహించామని, వైజాగ్‌ షోలో అరవై మంది పాల్గొన్నారని తెలిపారు. ఫ్యాషన్‌ డిజైనర్‌ శాండి, మోడల్‌ అనిల్‌ రాథోడ్‌, డాక్టర్‌ శ్రీతేజ, రాజు మరేలిలా ఆధ్వర్యంలోని జ్యూరీ ఎంపిక చేసిన వారు హైదరాబాద్‌లో జరిగే ఫైనల్స్‌లో పాల్గొంటారని తెలిపారు.   

Updated Date - 2021-10-18T06:04:05+05:30 IST