లంకణం పరమౌషధమే..!

ABN , First Publish Date - 2021-06-12T06:25:09+05:30 IST

లంకణం పరమౌషధం అన్నది సత్యమని, కొం దరు దీన్ని తోసిపుచ్చడం సరికాదని పతంజలి యోగ, ఆరోగ్య కేంద్రం వ్యవస్థాపకుడు, పిల్లల వైద్య నిపుణు డు బలరామ్‌ ప్రతాప్‌కుమార్‌ అన్నా రు.

లంకణం పరమౌషధమే..!
మాట్లాడుతున్న డాక్టర్‌ ప్రతాప్‌కుమార్‌

ఆకివీడు, జూన్‌ 11: లంకణం పరమౌషధం అన్నది సత్యమని, కొం దరు దీన్ని తోసిపుచ్చడం సరికాదని  పతంజలి యోగ, ఆరోగ్య కేంద్రం వ్యవస్థాపకుడు, పిల్లల వైద్య నిపుణు డు బలరామ్‌ ప్రతాప్‌కుమార్‌ అన్నా రు.  ఇంగ్లీషు వైద్యానికి తాను వ్యతిరేకం కాదన్నారు. శుక్రవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ  కరోనా వైరస్‌ తగ్గించుకొనేందుకు ఎనిమిది రోజులు  నియమాలు పాటించాలన్నారు. మొదటి రెండు రోజులు  నిమ్మకాయ రసంలో తేనె కలుపుకొని తాగాలన్నారు.  తర్వాత నాల్గు రోజులు పండ్లు, మొలకలు, బాదం, జీడి పప్పులు, క్యారెట్‌, బీట్‌రోట్‌తో పాటు మజ్జిగ అన్నం తింటే   వైరస్‌ చచ్చిపోతుందన్నారు. అనంతరం 2 నెలలు ముడి బియ్యంతో వండిన అన్నం, ఆకుకూరలతో తినాలన్నారు. ఈ విధంగా చేస్తే థర్డ్‌వేవ్‌ వైరస్‌ను కూడా మనం జయించగలమన్నారు.  ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో ఆకివీడులో వందల మందికి ఈ విధంగా నియమాలు పాటించేలా చేసి ప్రాణాలు కాపాడమన్నారు.  వ్యాయామం, ప్రాణాయామం కూడా చేసుకొంటే మంచిదన్నారు.   పతంజలి కార్యదర్శి కుంకట్ల సత్యనారాయణ, చిరంజీవి సత్యనారాయణ ఉన్నారు.


Updated Date - 2021-06-12T06:25:09+05:30 IST