సారా సమాచారం ఇచ్చాడని చంపేశారు

ABN , First Publish Date - 2022-01-18T05:25:24+05:30 IST

పోలీస్‌లకు సారా తయారీ సమచారం ఇచ్చాడని కక్ష తో తండ్రీ కొడుకులు ఒకరిని కొట్టి చంపేశారు.

సారా సమాచారం ఇచ్చాడని చంపేశారు
జీలుగుమిల్లి స్టేషన్‌లో డీఎస్పీ, పోలీసుల అదుపులో నిందితులు

నిందితులైన తండ్రీ కొడుకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు


జీలుగుమిల్లి, జనవరి 17: పోలీస్‌లకు సారా తయారీ సమచారం ఇచ్చాడని కక్ష తో తండ్రీ కొడుకులు ఒకరిని కొట్టి చంపేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జీలుగుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ కె.లతాకుమారి సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. జీలుగుమిల్లి మండలం పూచికపా డు గ్రామ సమీపంలో తండ్రీ కొడుకులు పరస వీర్రాజు, మహేష్‌ సారా కాస్తుం డగా పోరూరి రామ్‌కుమార్‌(48) ఈ నెల 13న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఆధారంగా సారా తయారీ స్థావరం వద్ద 1400 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌, సిబ్బంది బెల్లపు ఊట ను ధ్వంసం చేశారు. అదేరోజు సాయంత్రం గ్రామ కూడలిలో హోటల్‌ వద్ద రామ్‌ కుమార్‌ను వీర్రాజు, మహేష్‌ కర్రతో తలపై కొట్టారు. తల నుంచి రక్తస్రావం కావడంతో స్థానికుల సమాచారంతో 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామ్‌కుమార్‌ మృతి చెందా డు. విచారణ అనంతరం నిందితులైన తండ్రీ కొడుకులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.


టైలర్‌ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం?

ఏలూరు క్రైం, జనవరి 17: ఏలూరు నగరానికి చెందిన వడ్డీ వ్యాపారి, టైలర్‌ హత్యకు ఆర్థిక లావాదేవీల కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి నట్టు సమాచారం. ఆర్‌ఆర్‌ పేటలో ఉంటున్న ముదునూరి అచ్యుత రామరాజు(56) భార్య రాజేశ్వరి పేరు మీద సాయితేజ లేడీస్‌ టైలర్స్‌ షాపును నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆటోలు అద్దెకు ఇవ్వడం, చీటీలు, వడ్డీ వ్యాపారం, మగ్గాల వర్క్‌ కూడా చేస్తున్నాడు. వడ్డీ సొమ్ము ఆలస్యమైతే వారి కుటుంబంలో ఆడవారిని కించపరిచే విధంగా దుర్బాషలాడుతాడని చెబుతున్నారు. ఈనెల 14న సాయంత్రం అతనికి వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌తో స్కూటర్‌ వేసుకుని బయలుదేరి వెళ్లిన అతడు మినీ బైపాస్‌ రోడ్డులో హత్యకు గురయ్యాడు. పోస్టుమార్టం నిర్వహించగా అధిక మోతా దులో ఆల్కహాల్‌ ఉన్నట్టు గుర్తించారు. కుడివైపు చాతి ఎముకలు విరిగినట్టు వైద్యులు గుర్తించారని తెలిసింది. మెడ కూడా నులిమి ఉండడాన్ని గుర్తించారు. మృతు డికి ఆఖరు ఫోన్‌కాల్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. ఒక టైలర్‌తో వివాదం నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-01-18T05:25:24+05:30 IST