Abn logo
Jul 8 2020 @ 14:53PM

కరోనాతో తండ్రి మృతి.. తనకూ వచ్చిందన్న అనుమానంతో పొలంలోనే మహిళ నివాసం..

కరోనా అనుమానంతో..పొలం వద్దనే మహిళ నివాసం

ఆసుపత్రికి తరలించిన వైద్య సిబ్బంది


షాద్‌నగర్‌రూరల్‌/రంగారెడ్డి జిల్లా (ఆంధ్రజ్యోతి): కరోనా అనుమానంతో ఓమహిళ మూడు రోజులుగా కుటుంబ సభ్యులకు దూరంగా తమ వ్యవసాయ పొలం వద్ద నివాసముంటోంది. ఫరూఖ్‌నగర్‌ మండలం విఠ్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ, తన తండ్రికి ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఉస్మానియాలో చేర్పించగా సేవలు చేసేందుకు వెళ్లింది. కాగా ఈనెల 3న వైద్యపరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో గాంధీకి తరలించారు.


అనంతరం సదరు మహిళ విఠ్యాలకు వచ్చింది. తండ్రి కరోనాతో మృతి చెందినట్లు తెలుసుకున్న గ్రామస్థులు వారికి సమాచారం అందించారు. ఒకే ఇంట్లో ఉండకుండా వేర్వేరు గదుల్లో ఉండాలని గ్రామస్థులు సూచిండంతో ఆమె పొలం వద్ద ఉన్న గుడిసెలో ఉంటానని స్వచ్ఛందంగా మూడు రోజుల నుంచి గుడిసెలోనే నివాసముంటుంది. కాగా మంగళవారం వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలించారు.

Advertisement
Advertisement