మొబైల్ కోసం తండ్రితో గొడవ.. కొనివ్వలేదని ఆ కుర్రాడు ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-17T17:20:41+05:30 IST

ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది నిత్యావసరంగా మారిపోయింది.

మొబైల్ కోసం తండ్రితో గొడవ.. కొనివ్వలేదని ఆ కుర్రాడు ఎంత పని చేశాడంటే..

ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది నిత్యావసరంగా మారిపోయింది. మొబైల్ లేకుండా బతకడం అసాధ్యం అయిపోయింది. పెద్దలే కాదు.. పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్‌కు బానిసలుగా మారిపోతున్నారు. మొబైల్ కోసం తల్లిదండ్రులతో గొడవపడుతున్నారు. మొబైల్ కొనివ్వలేదని ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు రాజస్థాన్‌లోని శ్రీగంగాపూర్‌కు చెందిన ఓ కుర్రాడు. తల్లిదండ్రులు సకాలంలో గుర్తించి హాస్పిటల్‌లో జాయిన్ చేయడంతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. 


శ్రీగంగాపూర్‌కు చెందిన కిషోర్ అనే 14 ఏళ్ల కుర్రాడు మొబైల్ కొనివ్వమని తన తండ్రిని ఎప్పట్నుంచో అడుగుతున్నాడు. సోమవారం తన తండ్రిని మొబైల్ షాప్‌నకు తీసుకెళ్లాడు. అయితే అక్కడ కిషోర్ ఎంచుకున్న మొబైల్ కొనేందుకు సరిపడా డబ్బులు అతడి తండ్రి వద్ద లేవు. దీంతో ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు. తండ్రి తనకు మొబైల్ కొనివ్వలేదనే కోపంతో పురుగులను చంపే సుద్ద ముక్కలను కిషోర్ తినేశాడు. 


కిషోర్ చేసిన పనిని గుర్తించిన తల్లిదండ్రులు అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి డాక్టర్లు పెద్దాసుపత్రికి పంపించారు. అక్కడి వైద్యులు కిషోర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. 

Updated Date - 2021-11-17T17:20:41+05:30 IST