Abn logo
Sep 18 2021 @ 17:57PM

వెలుగు చూసిన కన్న తండ్రి కర్కశం

సూర్యాపేట: తాను చెప్పిన మాట వినలేదని కొడుకుని ఓ తండ్రి విచక్షణా రహితంగా బాదాడు. కన్నతండ్రి కర్కశంగా వ్యవహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రమణయ్య అనే వ్యక్తి తన కొడుకు (13)ను విపరీతంగా కొట్టాడు. చివ్వెంల మండలం కోమటికుంటలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 13 ఏళ్ల కొడుకును చితకబాదిన రమణయ్యపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

క్రైమ్ మరిన్ని...