Advertisement
Advertisement
Abn logo
Advertisement

పనిపై సిటీకి వెళ్లిన భర్త.. అర్ధరాత్రి గదిలోకి వచ్చిన మామయ్యను చూసి ఆ కోడలికి కంగారు.. భయంగానే ఏంటని అడిగితే..

స్త్రీలపై అత్యాచారాల కేసులు రోజురోజుకీ పెరగిపోతున్నాయి. ఆ కేసులలో ఎక్కువ శాతం బాధితులకు పరిచయమున్నావారే ఉండడం గమనార్హం. ప్రస్తుతం అలాంటి ఘటన గ్వాలియర్‌లో జరిగింది. 


గ్వాలియర్‌కు చెందిన సుకన్య(22, పేరు మార్చబడినది)కు అదే నగరానికి చెందిన రాజు(27)తో 2018లో వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండు సంవత్సరాల తరువాత రాజు తల్లి మరణించింది. ప్రస్తుతం సుకన్య, తన భర్త రాజుతో పాటు మామయ్య చటేశ్వర్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. గత కొద్ది కాలంగా సుకన్య, రాజుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా రాజు ఒకరోజు పనిమీద రాజధాని భోపాల్ వెళ్లాడు. ఆ రోజు రాత్రి సుకన్య తన గదిలో ఒంటరిగా నిద్ర పోతోంది. అర్ధరాత్రి సమయంలో గదిలో ఏదో అలకడి శబ్దానికి సుకన్య నిద్ర లేచింది. ఏమిటని చూస్తే తన మామయ్య చటేశ్వర్ ఆమె గదిలో ఉన్నాడు. సుకన్య కంగారుగా లేచి ఏమి కావాలి? ఎందుకు వచ్చారు? అని అడిగింది. అప్పుడు చటేశ్వర్ కూతురు వరుస అయ్యే కోడలితో చాలా అసభ్యంగా మాట్లాడాడు. తన కోరికలను తీర్చమన్నాడు. భార్య లేక తను ఒంటరి వాడినై పోయానని.. అందుకు ఆమె వద్దకు వచ్చానని చటేశ్వర్ అన్నాడు. ఇది విన్న సుకన్య షాక్‌కు గురైంది. ముందు తన గది నుంచి బయటకు వెళ్లమని అతనితో చెప్పింది. కానీ చటేశ్వర్ ఆమె మాటలను పట్టించుకోలేదు.


సుకన్య ఎంత చెప్పినా వినకపోవడంతో.. చటేశ్వర్ ఆమెపై బలప్రయోగం చేశాడు. ఆమెను లొంగదీసుకోవడానికి చితకబాదాడు. అపై అత్యాచారం చేసి.. ఈ విషయం బయటికి చెబితే ప్రాణాలతో చంపేస్తానని భయపెట్టాడు. మరుసటి రోజు ఉదయం సుకన్య సమయం చూసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ తన తల్లిదండ్రులకు జరిగినదంగా చెప్పింది. వాళ్లు వెంటనే ఆమెను తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంకా చటేశ్వర్‌ను అరెస్టు చేయలేదు. తాము విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement