Abn logo
Sep 19 2021 @ 16:16PM

భార్య మృతి..రెండో పెళ్లికి నో చెప్పిన మరదలు.. నలుగరు కూతుళ్ల తండ్రిని..నన్ను ఎవరు రెండో పెళ్లి చేసుకుంటారంటూ..

ఇంటర్నెట్ డెస్క్:  అతడి భార్య కరోనాకు బలైపోయింది. దీంతో ముఫ్పైఏళ్ల వయసులోనే అతడు ఒంటరివాడైపోయాడు. అప్పటికే అతడికి నలుగురు ఆడపిల్లలు. మరోవైపు..  ఒంటరి జీవితం భరించలేక అతడు మరో తోడును కోరుకున్నాడు. తన ఆశలన్నీ భార్య చెల్లెలిపైనే పెట్టుకున్నాడు. కానీ..అత్తవారేమో అతడి అభ్యర్థనను తిరస్కరించారు. ఆమెకు మరోచోట వివాహం కుదిరిందంటూ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. అతడు మాత్రం పట్టినపట్టు వీడలేదు. అత్తింటి వారు నచ్చచెప్పేకొద్దీ అతడిలో పట్టుదల, మూర్ఖత్వం పెరిగిపోయింది. మరదలు తనకు దక్కదన్న నిరాశలో అతడు చివరికి ఎవ్వరూ ఊహించిన దారుణానికి తెగబడ్డాడు. అతడి కిరాతకం  ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్ రాష్ట్రం బార్‌మర్ జిల్లాకు చెందిన పూర్ఖారామ్ కుటుంబంలో కరోనా పెను విషాదం మిగిల్చింది. కరోనా మహమ్మారి కారణంగా కొద్ది నెలల క్రితమే అతడి భార్య మరణించింది. దీంతో అతడు మరదలిని పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ  అత్తింటి వారు పుర్ఖారామ్ అభ్యర్థనను తిరస్కరించారు.  అయితే.. పుర్ఖారామ్‌ మాత్రం విషయాన్ని మరోలా అర్థం చేసుకున్నాడు. నలుగురు ఆడపిల్లలకు తండ్రైన వ్యక్తికి మళ్లీ వివాహం జరిగే అవకాశం లేదని నమ్మాడు. అందుకే అత్తింటి వారు మరదలితో వివాహానికి అంగీకరించలేదని భావించాడు.  రెండు రోజుల కిత్రం అతడు చివరిసారిగా అత్తారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. వారు మాత్రం ఎప్పటిలాగే అతడికి నో చెప్పారు.

ఇవీ చదవండి:

ఫ్రెండ్ భార్యతో ప్రేమాయణం.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇలా..

భార్యపై అనుమానం.. స్నేహితుల ముందే ఆమెను నీచంగా..

ఈ నిరాశలో అతడు ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అప్పటిదాకా అత్తారి దగ్గరే ఉంటున్న తన పిల్లలను స్వగ్రామానికి తెచ్చుకుని వారికి విషమిచ్చి వారిని బావిలోకి తోసేశాడు. అతడు కూడా విషం పుచ్చుని బావిలోకి దూకాడు. అయితే..అతడు బావిలో దూకుతుండగా గమనించిన కొందరు అతడిని  రక్షించగలిగారు. పిల్లలు మాత్రం అతడి ఉన్మాదానికి బలైపోయారు. బుర్ఖారామ్‌  బావమరిది  ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల భద్రత మధ్యే అతడికి చికిత్స జరుగుతోంది.

ప్రత్యేకంమరిన్ని...