చదువుకోమని స్మార్ట్‌ఫోన్ కొనిస్తే 17 ఏళ్ల కూతురి నిర్వాకాన్ని చూసి ఆ తండ్రికి ఆగ్రహం.. చివరకు..

ABN , First Publish Date - 2021-07-29T21:19:55+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండడంతో తండ్రి ఆమెకు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు..

చదువుకోమని స్మార్ట్‌ఫోన్ కొనిస్తే 17 ఏళ్ల కూతురి నిర్వాకాన్ని చూసి ఆ తండ్రికి ఆగ్రహం.. చివరకు..

లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండడంతో తండ్రి ఆమెకు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు.. అయితే ఆ బాలిక ఆ ఫోన్‌కు బానిస అయిపోయింది.. చదువును పక్కనపెట్టి 24 గంటలూ ఫోన్‌తోనే కాలం గడిపేది.. దీనిని గమనించిన తండ్రి ఆ బాలికను మందలించాడు.. దీంతో క్షణికావేశానికి లోనైన బాలిక విషం తాగేసింది.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మరణించింది.. మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


హోసంగాబాద్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఆన్‌లైన్ క్లాసులు కావడంతో తండ్రి ఆమెకు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్‌కు బానిస అయిన బాలిక చదువును పూర్తిగా పక్కనపెట్టేసింది. తల్లి, తండ్రి మందలించినా ఆమె వినేది కాదు. ఫోన్‌తోనే కాలమంతా గడిపేది. దీంతో మంగళవారం సాయంత్రం ఆ బాలిక, తండ్రి మధ్య స్మార్ట్‌ఫోన్ విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక విషం తాగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే తుదిశ్వాస విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 

Updated Date - 2021-07-29T21:19:55+05:30 IST