Sep 27 2021 @ 12:06PM

Vijay Antony భార్య ఎవరో తెలుసా..? విజయ్ కెరీర్ వెనుక ఆమె పాత్ర ఏంటో తెలిస్తే..

తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాలకు సంగీతం అందించి సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు విజయ్ అంటోనీ. ఆ తర్వాత నటుడిగా మారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. `బిచ్చగాడు` సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. విజయ్ విజయవంతమైన కెరీర్ వెనుక అతని భార్య ఫాతిమా మద్దతు ఎంతగానో ఉంది. ఆమె సలహాతోనే విజయ్ నటుడిగా మారాడు. 


సంగీత దర్శకుడిగా మారిన సంవత్సరం తర్వాత ఫాతిమాను విజయ్ వివాహం చేసుకున్నాడు. ఫాతిమాతో వివాహం తర్వాత విజయ్ సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత 2012లో ఫాతిమా సలహా మేరకే విజయ్ నటుడిగా మారాడు. విజయ్ కోసం ఆమె తరచుగా స్క్రిప్టులు వింటుంటుంది. అంతేకాదు విజయ్ ఆంటోనీ సినిమా ఫర్మ్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తూ ఆమె నిర్మాతగా కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు తమిళ సినిమాలకు ఫాతిమ నిర్మాతగా వ్యవహరించింది. ఫాతిమా, విజయ్ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.