దేశీ విమానాలు ఎక్కేందుకు టీకాలు తప్పనిసరి చేయాలి.. అమెరికా అంటువ్యాధుల నిపుణుడి సూచన

ABN , First Publish Date - 2021-12-29T03:09:10+05:30 IST

అమెరికాలో డొమెస్టిక్ విమాన సర్వీసులు(దేశీయంగా నడిపే విమానాలు) వినియోగించే వారికి కూడా కరోనా టీకాలు తప్పనిసరి చేస్తే మంచిదని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ అక్కడి ప్రభుత్వానికి సూచించారు.

దేశీ విమానాలు ఎక్కేందుకు టీకాలు తప్పనిసరి చేయాలి.. అమెరికా అంటువ్యాధుల నిపుణుడి సూచన

ఇంటర్నెట్ డెస్క్:  అమెరికాలో డొమెస్టిక్ విమాన సర్వీసులు(దేశీయంగా నడిపే విమానాలు) వినియోగించే వారికి కూడా కరోనా టీకాలు తప్పనిసరి చేస్తే మంచిదని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ అక్కడి ప్రభుత్వానికి సూచించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కారణంగా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ సూచన చేశారు. టీకా కచ్చితంగా తీసుకోవాలన్న నిబంధన అమలు చేస్తే దేశంలో టీకాకరణ మరింత వేగవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. అమెరికా జనాభాలో 62 శాతానికి పైగా ప్రజలు పూర్తిస్థాయిలో కరోనా టీకా తీసుకున్నారు.


Updated Date - 2021-12-29T03:09:10+05:30 IST