America తప్పు మార్గంలో వెళ్తోంది: ఆంథోనీ ఫౌచీ

ABN , First Publish Date - 2021-07-26T19:56:13+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతుండటంపట్ల ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడం.. డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య

America తప్పు మార్గంలో వెళ్తోంది: ఆంథోనీ ఫౌచీ

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతుండటంపట్ల ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడం.. డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఆంక్షలను సడలించడంపట్ల అమెరికా అధికారులను ఫౌచీ హెచ్చరించారు. మహమ్మారిని ఎదుర్కొవడంలో అమెరికా ప్రస్తుతం ‘తప్పు మార్గం’లో వెళుతోందని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో సగం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకా సగం మంది టీకా తీసుకోలేదు. దేశానికి ఇది పెద్ద సమస్య. రానున్న రోజుల్లో కొవిడ్ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం తప్పు మార్గంలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా లాస్ఏంజిల్స్, సెయింట్ లూయిస్ రాష్ట్రాలు.. మాస్క్ తప్పనిసరి ఆదేశాలు జారీ చేయడాన్ని ఫౌచీ సమర్థించారు. కాగా.. వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తులు మాస్కులు ధరించనవసరం లేదని అమెరికా సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) మార్గదర్శకాలు జారీ చేయడం పట్ల ఆంటోని ఫౌచీ ఈ విధంగా స్పందించారు. 


Updated Date - 2021-07-26T19:56:13+05:30 IST