ఇష్టారాజ్యం!

ABN , First Publish Date - 2021-12-03T06:29:16+05:30 IST

రియల్టర్లు కనీ స నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా లే ఔట్లు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇష్టారాజ్యం!

ఈ చిత్రంలో కనిపిస్తున్న లేఔట్‌ రూరల్‌ మండలంలోని కాటిగానికాలువ ఎస్సీ కాలనీ సమీపంలోనిది. సర్వే నెంబరు 26-1లోని నాలుగు ఎకరాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఈ లేఔట్‌ వేశారు. పంచాయతీ, అహుడా అనుమతులు లేకుండా లేఔట్‌ వేయడం గమనార్హం. ఎక్కడా ప్రజావసరాల నిమిత్తం స్థలం కూడా వదలేదు. ఇక్కడ సెంటు రూ.2లక్షలకు పైగానే విక్రయిస్తున్నారు. 



అధికార పార్టీ రియల్టర్ల మాయాజాలం

విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ లేఔట్లు

కానరాని పంచాయతీ, అహుడా నిబంధనలు 

ఉదాసీన వైఖరిలో సంబంధిత అధికారులు

పంచాయతీ అదాయానికి భారీ గండి

అనంతపురంరూరల్‌,డిసెంబరు2: రియల్టర్లు కనీ స నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా  లే ఔట్లు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు పుట్టుకొస్తున్నాయి. పంచాయతీ, అహుడా నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇందులో ఎక్కువ శాతం అధికార పార్టీకి చెందిన వారి లేఔట్లు ఉండటం గమనార్హం. రూ రల్‌ మండలంలోని ప్రాంతాల్లో వెలసిన లేఔట్లలో 70శా తం వరకు అధికార పార్టీకి చెందిన వారివే ఉంటున్నట్లు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈక్రమంలోనే నిబంధనలను తుంగలో తొక్కి లేఔట్లను వేసేసి అమ్మేస్తున్నారు. మండలంలోని ప్రాంతాలు అహుడా పరిధిలోకి వస్తాయి. అయితే వీటిని అహుడా పరిధిలోకి తీసుకురాకుండా మ్యా నేజ్‌ చేసి తమ వ్యాపారాన్ని సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. లేఔట్లు నిబంధనలకు విరుద్ధంగా వేశారని పంచాయతీ అధికారులకు తెలిసిన ఉదా సీన వైఖరి ప్రదర్శిస్తున్నారు. అవి అధికారపార్టీకి చెందినవారివి కావటమే  ప్రధాన కారణం. 


విచ్చలవిడిగా లేఅవుట్లు

మండలంలోని గ్రామాలు నగరానికి అతిసమీపంలో ఉ న్నాయి. మండలంలో 33గ్రామాలుండగా..ఐదారు గ్రామా లు నగరానికి దూరంలో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలన్నీ ఇంచుమించు 10 నుంచి 15కిలో మీటర్ల లోపు ఉన్నాయి. దీంతో రియల్టర్లు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి లేఔట్లుగా మార్చేస్తున్నారు. కురుగుంట, అక్కంపల్లి, రాచానపల్లి, కొడిమి, ఆలమూరు, కక్కలపల్లి, ఉప్పరపల్లి, ఇటుకలపల్లి, ఆకుతోటపల్లి, చిన్నంపల్లి, కామారుపల్లి, తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో లేఔట్లు వెలిశాయి. అయితే నిబంధనలు మాత్రం పాటించడం లేదు. 


అహుడా పరిధిలోకి రాకుండా మేనేజ్‌..

లేఔట్లు ఎక్కువశాతం అధికార పార్టీకి చెందిన వారివి కావటంతో  అవి అహుడా పరిధిలోకి రాకుండా మేనేజ్‌ చే స్తున్నార్న వాదనలున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లను ఉపయోగించుకుని లేఔట్లను అహుడాలోకి రాకుం డా చక్కబెట్టుకున్నారన్న వాదనలు ఆయా వర్గాల ద్వారా తెలుస్తున్నాయి. సాధారణంగా లేఔట్‌ వేయాలంటే తొలు త భూమి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుం దా.. లేదా..చూసుకోవాలి. ల్యాండ్‌ కన్వర్షన చేయించుకోవాలి. ఆతరువాత అహుడా నిబంధనల ప్రకారం లేఔట్‌ వేయాల్సి ఉంటుంది. లేఔట్‌లో కాలువలు, 40, 30 అడుగుల రోడ్లు ఉండాలి. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో లేఔట్‌ వేసిన పం చాయతీకి ఎకరాకు 10సెంట్ల ప్రకారం ఓపెన సైట్‌ రిజిస్టర్‌ చేయించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివి ఏవి జరగకుండానే లేఔట్లు వెలుస్తున్నాయి. తద్వారా క్రయవిక్రయాలు చేసేస్తున్నారు. అహుడా నిబంధనలు పాటించని జాబితాలో ఉన్న వాటికి సైతం రిజిస్టర్‌ జరుగుతుండటం రియల్టర్లకు కలిసి వస్తోంది. ఇందుకు ఇటీవల ఉప్పరపల్లి, కురుగుంట తదితర గ్రామ పరిధిలోని కొన్ని సర్వే నెంబర్లలో ఇలానే రిజస్టర్లు జరగడం ఉదాహరణ.


ప్రభుత్వ ఆదాయానికి గండి

అక్రమ లేఔట్లతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సాధారణంగా అయితే స్థానిక మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరాకు రూ.15వేలకుపైగా ఫీజు రూ పంలో అహుడాకు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సె క్యూర్టీ డిపాజిట్‌ అదే స్థాయిలోనే చెల్లించడంతో పాటు బెటర్‌మెంట్‌ చార్జీలు ఇలా మొత్తంగా రూ.50వేలకు పైగా కట్టాల్సి ఉంటుంది. పంచాయతీకి ఎకరాకు పది సెంట్ల చొ ప్పున స్థలం కేటాయించాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత లేఔట్‌ వేయాల్సి ఉంటుంది. అయితే ఇవేవీ లేకుండానే లేఔట్లు వెలుస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఫీజుల రూపంలో గండి పడుతుండగా..పంచాయతీలలో ప్రజా అవసరాలకు స్థలాలు లేకుండా పోతున్నాయి.  



ఈచిత్రంలో కనిపిస్తున్న లేఔట్‌ మండలంలోని కక్కలపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలోనిది. సర్వే నెంబరు 218. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకుడు 1.92 ఎకరాల్లో  లేఅవుట్‌ వేశారు. ఇక్కడ ఎక్కడ కూడా పంచాయతీ, అహుడా నిబంధనలు కనిపించవు. ఇప్పటి వరకు ల్యాండ్‌ కన్వర్షన జరగలేదు. కేవలం కన్వర్షనకు దరఖాస్తు చేసుకున్నారు. అయినా సెంటు రూ.4లక్షలతో అమ్ము తున్నారు. దీనికి ఆనుకుని 100 అడుగల దూరంలో 213-13లో రెండు ఎకరాలకు పైగా లేఔట్‌ వేశారు. ఇళ్ల ని ర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఈ లేఔట్‌ను వంకకు ఆనుకుని వేశారు. ఇక్కడా నిబంధనలు పట్టించుకోలేదు.  వంకలకు, చెరువులకు ఆనుకుని నిర్మాణం చేసిన ఇళ్ల పరిస్థితి ఇటీవల గమనించనిది కాదు. 


ఈ చిత్రంలో కనిపిస్తున్న లేఔట్‌ రూరల్‌ మండలంలోని కాటిగానికాలువ ఎస్సీ కాలనీ సమీపంలోనిది. సర్వే నెంబరు 26-1లోని నాలుగు ఎకరాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నా యకుడు ఈ లేఔట్‌ వేశారు. పం చాయతీ, అహుడా అనుమతులు లేకుండా లేఔట్‌ వే య డం గమనార్హం. ఎక్కడా ప్రజావసరాల నిమిత్తం స్థలం కూ డా వదలేదు. ఇక్కడ సెంటు రూ.2లక్షలకు పైగానే విక్రయిస్తున్నారు. 


Updated Date - 2021-12-03T06:29:16+05:30 IST