ఐర్లాండ్ నుంచి ఎఫ్‌బీ అధికారి ఫోన్‌... యువ‌కుడిని కాపాడిన ఢిల్లీ పోలీసులు!

ABN , First Publish Date - 2020-08-10T14:07:11+05:30 IST

ఐర్లాండ్‌కు చెందిన ఫేస్‌బుక్ అధికారి నుంచి వ‌చ్చిన ఫోనును రిసీవ్ చేసుకున్న‌ డిల్లీ పోలీసులు ముంబైలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఢిల్లీకి చెందిన‌ యువకుని ప్రాణాలను కాపాడారు. ముంబైలో...

ఐర్లాండ్ నుంచి ఎఫ్‌బీ అధికారి ఫోన్‌... యువ‌కుడిని కాపాడిన ఢిల్లీ పోలీసులు!

న్యూఢిల్లీ: ఐర్లాండ్‌కు చెందిన ఫేస్‌బుక్ అధికారి నుంచి వ‌చ్చిన ఫోనును రిసీవ్ చేసుకున్న‌ డిల్లీ పోలీసులు ముంబైలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఢిల్లీకి చెందిన‌ యువకుని ప్రాణాలను కాపాడారు. ముంబైలో కుక్‌గా పనిచేస్తున్న ఆ యువ‌కుడు ఫేస్‌బుక్‌లో సూసైడ్ చేసుకుంటున్న‌ట్లు పోస్ట్ పెట్టాడు. ఈ సమాచారం అందుకున్న‌ సైబర్ సెల్ వెంటనే రంగంలోకి దిగి, సాంకేతికత సాయంతో ఆ యువ‌కుడు ఉంటున్న ప్రాంతాన్ని తెలుసుకుని, ముంబై పోలీసులకు ఈ విష‌యాన్ని తెలిపారు. ఈ ఉందంతం గురించి సైబ‌ర్ సెల్ డీసీపీ అనేష్ రాయ్ మాట్లాడుతూ ఐర్లాండ్‌కు చెందిన ఫేస్‌బుక్ అధికారి త‌మ‌కు ఫోన్ చేసి... ఢిల్లీకి చెందిన ఓ యువ‌కుడు ముంబైలో ఆత్మహత్య చేసుకోబోతున్నాడ‌ని తెలిపార‌న్నారు. దీనిని అ అధికారి త‌మ‌కు ఈమెయిల్ కూడా చేశార‌న్నారు. దీంతో అల‌ర్ట్ అయిన పోలీసులు ఆ వ్య‌క్తి ఫేస్‌బుక్ ఖాతా ఆధారంగా ఫోన్ నంబర్ తెలుసుకున్నారు. త‌రువాత అత‌ను ప్ర‌స్తుతం ముంబైలో ఉంటున్నాడ‌ని తెలుసుకుని, అక్కడి పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేశారు. దీంతో ముంబై పోలీసులు ఆ యువ‌కుడు ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నారు. అత‌నిని అదుపులోనికి తీసుకుని, కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.

Updated Date - 2020-08-10T14:07:11+05:30 IST