పోలీస్‌స్టేషన్‌కు ఎఫ్‌బీవో సస్పెన్షన్‌ వ్యవహారం

ABN , First Publish Date - 2021-04-12T06:07:17+05:30 IST

మామడ అటవీ రేంజ్‌ పరిధిలోని ఎల్లారెడ్డిపేట్‌ ఎఫ్‌బీవోగా విధులు నిర్వహిస్తున్న లెనిన్‌ ఇటీవల సస్పెండ్‌ అయిన వ్యవహారం నిర్మల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో చర్చానీయంశంగా మారింది. బీట్‌ అధికారి సస్పెన్ష న్‌ విషయంలో అధికారులు ఒక మాట చెబితే.. బాధితుడు

పోలీస్‌స్టేషన్‌కు ఎఫ్‌బీవో సస్పెన్షన్‌ వ్యవహారం

విధుల్లో నిర్లక్ష్యం చేశారంటున్న అధికారులు

అక్రమ రవాణాకు సహకరించలేదని సస్పెండ్‌ చేశారంటున్న ఎఫ్‌బీవో

నిర్మల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): మామడ అటవీ రేంజ్‌ పరిధిలోని ఎల్లారెడ్డిపేట్‌ ఎఫ్‌బీవోగా విధులు నిర్వహిస్తున్న లెనిన్‌ ఇటీవల సస్పెండ్‌ అయిన వ్యవహారం నిర్మల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో చర్చానీయంశంగా మారింది. బీట్‌ అధికారి సస్పెన్ష న్‌ విషయంలో అధికారులు ఒక మాట చెబితే.. బాధితుడు మరో మాట చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 8న బీట్‌ అధికారి లెనిన్‌ కనకాపూర్‌ పారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయం లో అర్ధరాత్రి వేళ ఖానాపూర్‌ వైపు నుంచి వచ్చిన ఇసుక లారీలను అపానని, ఆ ఇసుక  లారీలకు అనుమతి పత్రాలు లేకపోవడంతో తాను తమ ఎఫ్‌ఆర్వో కల్పనకు వివరాలు తెలియజేశానని ఎఫ్‌బీవో లెనిన్‌ చెబుతున్నారు. అయితే, తాను లారీలను రేంజ్‌ కార్యాలయానికి తరలిం చి పీవోఆర్‌లో సదరు లారీల్లో 38, 35 సీఎంటీల ఇసుక  ఉన్నట్లు నమోదు చేశానని, దీంతో తనను సస్పెండ్‌ చేస్తామని బెదిరించారన్నారు. ఆ తర్వాత ఈనెల 10న తనను ఎఫ్‌ఆర్‌వో కార్యాలయానికి పిలిచి ఎఫ్‌డీవో కోటేశ్వర్‌రావు, ఎఫ్‌ఆర్‌వో కల్పనలు బెదిరించారని, తన సెల్‌ఫోన్‌ లాక్కుని తనపై దాడికి ప్రయాత్నించారని, తనను సస్పెండ్‌ చేస్తామని బెదిరించారని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న తనకు అధికారులు అన్యాయం చేశారని ఆరోపించారు.  

విధుల్లో నిర్లక్ష్యం : ఎఫ్‌డీవో కోటేశ్వర్‌రావు

ఎల్లారెడ్డిపేట్‌ ఎఫ్‌బీవో లెనిన్‌ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే అతడిని సస్పెండ్‌ చేశామని ఎఫ్‌డీవో కోటేశ్వర్‌రావు తెలిపారు. ఇసుక లారీలను ఆపిన వెంటనే అటవీరేంజ్‌ కార్యాలయానికి తీసుకురాకుండా బేరాసారాలు చేశాడని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకున్నామన్నారు. అతడు చేస్తున్న ఆరోపణలపై శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. 

విచారణ చేపడుతాం : నిర్మల్‌ సీఐ శ్రీనివాస్‌

ఎల్లారెడ్డిపేట్‌ ఎఫ్‌బీవో లెనిన్‌ తమకు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని నిర్మల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన అంతర్గత వ్యవహారం అయినందున, పూర్తి విచారణ చేపట్టిన తర్వాతనే తదుపరి చర్యలు చేపడుతామని తెలిపారు.  

Updated Date - 2021-04-12T06:07:17+05:30 IST