America లో ఆ ఔషధం కోసం క్యూకడుతున్న జనాలు..

ABN , First Publish Date - 2021-11-06T14:11:06+05:30 IST

అమెరికాలోని స్థూలకాయుల చూపు.. ఇప్పుడు మెడికల్‌ షాపుల వైపు ఉంది. వారంతా అడుగుతున్నది ఒకే ఒక ఇంజెక్షన్‌.

America లో ఆ ఔషధం కోసం క్యూకడుతున్న జనాలు..

‘వెగొవీ’కి భారీగా పెరిగిన గిరాకీ 

వాషింగ్టన్‌, నవంబరు 5: అమెరికాలోని స్థూలకాయుల చూపు.. ఇప్పుడు మెడికల్‌ షాపుల వైపు ఉంది. వారంతా అడుగుతున్నది ఒకే ఒక ఇంజెక్షన్‌. దాని పేరే ‘వెగొవీ’ (సెమగ్‌లుటైడ్‌). ఎఫ్‌డీఏ నుంచి తొలిసారిగా అనుమతి పొందిన ఊబకాయం తగ్గించే ఔషధం ఇది. మధుమేహం ఉన్నవారు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నట్టే.. ఊబకాయం ఉన్నవారు వైద్యుల సూచన మేరకు వారానికి ఒక ‘వెగోవీ’ని తీసుకోవచ్చు. దీనివల్ల ఆకలి నియంత్రణలోకి వచ్చి ఎంత ఆహారం అవసరమో అంతే తింటారు. ఫలితంగా శరీర బరువు 15 శాతం వరకు తగ్గిపోతుందని అంటున్నారు. అమెరికాలో స్థూలకాయుల సంఖ్య చాలా ఎక్కువ. కొవిడ్‌ వల్ల వాళ్లకు ముప్పు ఎక్కువని నివేదికలు హెచ్చరించాయి. ఈ నేపధ్యంలో ‘వెగొవీ’ ఇంజెక్షన్‌ కోసం మందుల షాపుల ఎదుట ఊబకాయులు బారులుతీరుతున్నారు. అయితే ఒక్కో ఇంజెక్షన్‌ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.30వేలు. అంటే ఒక నెల రోజులు దీన్ని వాడాలన్నా రూ.లక్షకుపైగా వెచ్చించాల్సి ఉంటుంది. కాగా, వెగొవీని వినియోగించిన పలువురిలో వికారం, వాంతులు, అతిసారం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయి. 

Updated Date - 2021-11-06T14:11:06+05:30 IST