Advertisement
Advertisement
Abn logo
Advertisement

అరబిందో యూనిట్‌కు ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మా ఏపీఐ యూనిట్‌కు యూఎస్‌ ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖ జారీ చేసింది. హైదరాబాద్‌లోని యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ)ను తయారు చేసే యూనిట్‌-1ను గత ఏడాది ఆగస్టులో అమెరికా ఎఫ్‌డీఏ బృందం తనిఖీ చేసిందని.. కొన్ని లోపాలను గుర్తించి హెచ్చరిక లేఖను జారీ చేసిందని కంపెనీ తెలిపింది. యూఎస్‌ ఎఫ్‌డీఏ సూచించిన లోపాలను సవరించి నిర్ణీత కాలంలో నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తామని అరబిందో పేర్కొంది. హెచ్చరిక లేఖ జారీ వల్ల యూనిట్‌-1 నుంచి జరిగే వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. 

Advertisement
Advertisement