కేసీఆర్‌కు భయం మొదలైంది..

ABN , First Publish Date - 2022-01-28T08:09:14+05:30 IST

సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని, అందుకే ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్య సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని, అందుకే ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

కేసీఆర్‌కు భయం మొదలైంది..

  • అందుకే అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి: బండి సంజయ్‌
  • ఘటనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం: అర్వింద్‌

నందిపేట/నిజామాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని, అందుకే ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్య సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని, అందుకే ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఇందులో భాగంగానే నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై కత్తులు, రాడ్లు, కర్రలతో దాడి జరిగిందని ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో దాడులకు గురైన పలువురు బీజేపీ కార్యకర్తలను అర్వింద్‌తో కలిసి సంజయ్‌ గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాడులు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రే చెబితే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమవుతాయని ప్రశ్నించారు. ఎంపీ కాన్వాయ్‌పై దాడి జరిగితే.. ఇప్పటి వరకూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంవత్సరమే ఉంటుందని.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కాగా, గవర్నర్‌ వ్యవస్థను గౌరవించని సంస్కారహీనుడు సీఎం కేసీఆర్‌ అని సంజయ్‌ విమర్శించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి శుక్రవారం స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. తనపై రైతులే దాడి చేశారంటూ టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. రైతులైతే కత్తులు, కర్రలతో దాడులకు వస్తారా?అని ప్రశ్నించారు. దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిజామాబాద్‌ సీపీపైనా కేసు నమోదు చేయాలని కోరినట్లు చెప్పారు. 

Updated Date - 2022-01-28T08:09:14+05:30 IST