‘పురం’లో దొంగల భయం

ABN , First Publish Date - 2021-10-25T05:34:45+05:30 IST

ఇటీవల హిందూపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు.

‘పురం’లో దొంగల భయం
సీపీఐ కాలనీలో దొంగలు ధ్వంసం చేసిన బీరువా (ఫైల్‌)

- వరుస చోరీలు, చైనస్నాచింగ్‌లతో ప్రజల బెంబేలు  

- పోలీసులకు  దొంగల సవాల్‌

హిందూపురం టౌన, అక్టోబరు 24: ఇటీవల హిందూపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. పట్టణంలోని వనటౌన పోలీ్‌సస్టేషన, టూటౌన పోలీ్‌సస్టేషన పరిధిలో ఇళ్లలో చోరీలతోపాటు చైనస్నాచింగ్‌ జరుగుతున్నాయి. దీనికారణంగా ఇల్లు వదలిపోవాలంటే ప్రజలు జంకుతున్నారు. సాయంత్రంపూట వాకింగ్‌ వెళ్లడానికి మహిళలు బెంబేలెత్తుతున్నారు. ఇందుకు కారణం సాయంత్రంపూట వాకింగ్‌ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. నాలుగు రోజుల క్రితం గంట వ్యవధిలో మూడుచోట్ల చైనస్నాచింగ్‌ జరిగాయి. పాండురంగనగర్‌, టీచర్స్‌కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ ప్రాంతాల్లో వాకింగ్‌ చేస్తున్న మహిళ మెడలోంచి ద్విచక్రవాహనాల్లో వచ్చిన దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. అదేవిధంగా వనటౌన పరిధిలో పరిగి బస్టాండు, ఆర్టీసీ బస్టాండు  వద్ద, ముద్దిరెడ్డిపల్లిలో చైనస్నాచింగ్‌ జరిగింది. దీనికితోడు పట్టపగలే తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడ్డారు. ఆర్టీసీ కాలనీ, హస్నాబాద్‌, బోయపేట, సీపీఐ కాలనీ ప్రాంతా ల్లో దొంగతనాలు జరిగినట్లు తెలిసింది. అయితే ఇందులో కొంతమంది మాత్రమే స్టేషన వరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వరుస చోరీల నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం అప్రమత్తమయ్యారు. దీంతో రెండు రోజులుగా సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాష, సీఐ వాహీద్‌బాష ఆధ్వర్యంలో దొంగలకోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. 

పాత నేరస్తులపై నిఘా : మహబూబ్‌బాష, సీసీఎస్‌ డీఎస్పీ  

పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాలు చైన స్నాచింగ్‌లపై గట్టి నిఘా ఉంచాం. నాలుగు బృందాలుగా విడిపోయి పట్టణంతోపాటు గ్రామాల్లో కూడా నేరస్తులను జల్లెడ పడుతున్నారు. పాత నేరస్తుల కదలికలపై వారు ఎక్కడున్నారన్నదానిపై ఆరాతీస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. 


Updated Date - 2021-10-25T05:34:45+05:30 IST