బాగా ఊదితే మీరే విన్నర్‌!

ABN , First Publish Date - 2020-06-13T05:30:00+05:30 IST

సింపుల్‌గా అనిపించినా, ఈ ఆటతో బోలెడు ఫన్‌ దొరుకుతుంది. టైమ్‌పాస్‌ అవుతుంది. ఈ ఆట ఆడటం కోసం...

బాగా ఊదితే మీరే విన్నర్‌!

సింపుల్‌గా అనిపించినా, ఈ ఆటతో బోలెడు ఫన్‌ దొరుకుతుంది.  టైమ్‌పాస్‌ అవుతుంది. ఈ ఆట ఆడటం కోసం


కావలసినవి... 

ఈకలు (ప్లాస్టిక్‌వి, తేలికగా ఉండేవి), టైమర్‌


ఎలా ఆడాలి?

  1. ఈ ఆటను నలుగురైదుగురు కలిసి ఆడుకోవచ్చు. 
  2. ఒక్కొక్కరు ఒక ఈకను చేతిలోకి తీసుకుని వరుసలో నిల్చోవాలి.
  3. టైమర్‌ సెట్‌ చేసుకోవాలి. ‘గో’ అనగానే ఈకను గాల్లోకి ఊదాలి. తరువాత అది కిందపడకుండా ఊదుతూనే ఉండాలి. ఈకను చేత్తో ముట్టుకోకూడదు.
  4. ఒక నిమిషం టైమ్‌ పెట్టుకుంటే కనుక ఆ సమయం వరకు ఈక కిందపడకుండా ఊదుతూనే ఉండాలి.
  5. ఎక్కువ సమయం ఎవరైతే ఈక కింద పడకుండా గాల్లో ఉండేలా ఊదుతారో వారు గెలిచినట్టు!
  6. ఈ ఆటను ఇలా కూడా ఆడొచ్చు. ఒక గదిలో బకెట్‌ ఏర్పాటు చేయలి. మరో గదిలో నుంచి మొదలుపెట్టి ఈకను ఊదుకుంటూ వచ్చి ఆ బకెట్‌లో పడేలా చేయాలి. చేత్తో ముట్టుకోకుండా నెమ్మదిగా ఊదుకుంటూ వెళ్లి ఈకను బకెట్‌లో వేసిన వారు గెలిచినట్టు.  

Updated Date - 2020-06-13T05:30:00+05:30 IST