వాళ్లు చాలా ఫ్రెండ్లీ!

ABN , First Publish Date - 2020-10-07T05:51:58+05:30 IST

అక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఒక్కసారి ఆ దేశానికే వెళితే ఇంకోసారి వెళ్లాలని అనిపిస్తుంది. తూర్పు కరేబియన్‌ సముద్ర ప్రాంతంలో కనిపించే చిన్న ద్వీపం బార్బడోస్‌ విశేషాలివి...

వాళ్లు చాలా ఫ్రెండ్లీ!

అక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఒక్కసారి ఆ దేశానికే వెళితే ఇంకోసారి వెళ్లాలని అనిపిస్తుంది. తూర్పు కరేబియన్‌ సముద్ర ప్రాంతంలో కనిపించే చిన్న ద్వీపం బార్బడోస్‌ విశేషాలివి.


  1. ఇక్కడ అధికార భాష బార్బడోస్‌. కరెన్సీ బార్బడియన్‌ డాలర్‌. ఈ దేశంలో అందరికీ ఉచిత విద్య అందుబాటులో ఉంది. అక్షరాస్యత శాతం దాదాపు 100 శాతం కనిపిస్తుంది.
  2. ట్రయాంగిల్‌ ఆకారంలో ఉండే ఈ దేశంలో తాగేనీటి కోసం వర్షంపైనే ఆధారపడతారు. వర్షపు నీరును చిన్న కొలనుల్లోకి ప్రవహించేలా చేసి నిలువ చేసుకుంటారు. ఆ నీరే అవసరాలకు వాడుకుంటారు. ఈ దేశంలో స్వచ్ఛమైన నీటిని అందించే వ్యవస్థ ఉంది. 
  3. పత్తి, పంచదార, పొగాకు ఎక్కువగా పండిస్తారు. పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయి. 
  4. ఈ దేశ రాజధాని బ్రిడ్డ్‌టౌన్‌. పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. 

Updated Date - 2020-10-07T05:51:58+05:30 IST